టాలీవుడ్ హీరోయిన్, బీజేపీ నేత మాధవీ లతపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాధవీలత ఒక వ్యభిచారి అంటూ ఫైర్ అయ్యారు. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. న్యూ ఇయర్ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేకంగా ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్ పై మాధవీ లత స్పందిస్తూ.. మహిళలు జేసీ పార్క్ వైపు వెళ్లొద్దు, అక్కడ దారుణమైన ఘటనలు జరుగుతున్నాయంటూ వీడియో విడుదల చేసింది.
ఈ విషయంపై తాజాగా జేసీ రియాక్ట్ అయ్యారు. మహిళలను అవమానించే విధంగా మాధవీ లత మాట్లాడుతుంది.. జేసీ పార్కులో ఎలాంటి దారుణ ఘటనలు జరగడం లేదని స్పష్టం చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహిస్తే తప్పేంటి? అంటూ జేసీ ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మాధవీలత ఒక వ్యభిచారి అంటూ జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాధవీలతను బీజేపీలో ఎందుకు పెట్టుకున్నారో అర్థం కావడం లేదు.. ఆమె ఒక వేస్ట్ క్యాండిడేట్ అని విమర్శించారు.
ఇక జేసీ దివాకర్ ట్రావెల్స్ బస్సులు దగ్ధంపై కూడా జేసీ స్పందించారు. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే బస్సులు దగ్ధం ఘటనపై తాను ఫిర్యాదు చేయబోనని.. పోలీసులపై తనకు నమ్మకం లేదని జేసీ అన్నారు. పథకం ప్రకారమే బస్సులు దగ్ధం చేశారని.. ఇందులో బీజేపీ నేతల ప్రమేయం ఉండొచ్చని ఆరోపించారు. 300 బస్సులు పోతేనే బాధపడలేదు.. ఇప్పుడెందుకు బాధపడతానని జేసీ అన్నారు. చేతనైతే పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేసి తన బస్సులను దగ్ధం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జేసీ డిమాండ్ చేశారు. ప్రస్తుతం జేసీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.