ఎన్నారై తెలుగుదేశంలో ఎన్నడూ లేనంత కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఎన్నారై తెలుగుదేశం నూతన సమన్వయ కర్త (అమెరికా) కోమటి జయరాం, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ సమక్షంలో, వెంకట్ కోగంటి వ్యాఖ్యాతగా ఆదివారం రాత్రి జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతం అయ్యింది. ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు.
సామాజిక అసమానతలు తొలగించే సమున్నత లక్ష్యం తో అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగే ఏకైక తెలుగు ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ ఎన్నారై తెలుగు తెలుగుదేశం నూతన సమన్వయ కర్త (అమెరికా) కోమటి జయరాం వ్యాఖ్యానించారు.
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ మాట్లాడుతూ 2024 లో ఎన్నారైలందరూ ఒక్కటై ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. 2014 ప్రజలు చంద్రబాబు అవసరం కొత్త రాష్ట్రానికి ఉందని కోరి గెలిపించారు. 2019లో మోసపూరిత అబద్ధాలతో మోసపోయిన తెలుగు ప్రజలు తమ పొరపాటును తెలుసుకుని 2014 కంటే ఎక్కువ అవసరం ఇప్పుడు రాష్ట్రానికి ఉందని 2024 ఎన్నికల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారని పట్టాభిరామ్ వ్యాఖ్యానించారు.
కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి కొమ్మారెడ్డి, మాజీ ఎంపీ విద్య చెన్నుపాటి కుమారుడు వజీర్ చెన్నుపాటి, టొబాకో మాజీ ఛైర్మన్ సుబ్బారావు మన్నవ తదితరులు కొత్త హోదాలో నియమితులైన జయరాం కోమటిని అభినందించారు.
దశాబ్దాలుగా టీడీపీతో కోమటి ప్రయాణాన్ని గుర్తుచేసి సుబ్బారావు మన్నవ జయరాం ను అభినందించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జయరాం కోమటి… 2024 లో తెలుగుదేశం గెలుపే ఏపీ గెలుపు అనే లక్ష్యంతో ఎన్నారైలందరినీ సమన్వయం చేసుకుని ఏకతాటిపై నడిపిస్తామని అన్నారు.
పదవి ముళ్ల కిరీటమే, కానీ బాధ్యత మాత్రం మరువను
ఎన్నారై టీడీపీని ఏకతాటిపై నడిపించడమే నా లక్ష్యం అన్నారు. ఈ సందర్భంగా జయరాం కోమటి, పట్టాభిరాం, వజీర్, సుబ్బారావు మన్నవ, వెంకట్ కోగంటి తదితరులు టీడీపీ మెంబర్ షిప్ డ్రైవ్ ను ప్రారంభించగా అనూహ్య సంఖ్యలో ఎన్నారైలు సభ్యత్వం తీసుకున్నారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఎన్నారైలను ఉద్దేశించి లైవ్ లో జూమ్ ద్వారా ప్రసంగించారు. కొత్త పదవిలో నియమితులైన సందర్భంగా ఆయన జయరాం కోమటిని అభినందించారు.
బే ఏరియా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ… ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేసి తెలుగుదేశం ప్రభుత్వం నెలకొల్పాలని, ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవడం మన బాధ్యత అని అన్నారు. చంద్రబాబు ప్రసంగం ఎన్నారై టీడీపీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపింది.
చంద్ర గుంటుపల్లి, శ్రీకాంత్ దొడ్డపనేని, భక్త భల్ల, రజనీకాంత్ కాకర్ల, కృష్ణ గొంప, గోకుల్ మాచిరాజు, భరత్ ముప్పిరాళ్ల, విజయ ఆసూరి, ప్రసాద్ మంగిన, సతీష్ బోళ్ల, లక్ష్మణ్ పరుచూరి, గంగ కోమటి , సందీప్ ఇంటూరి, విజయ్ గుమ్మడి, గాంధీ పాపినేని, శ్రీకర్ రెడ్డి, వీరు ఉప్పల, భాస్కర్ వల్లభనేని, శ్రీనివాస్ వల్లూరిపల్లి, లియోన్ రెడ్డి, వాసు బండ్ల, శ్రీనివాస్ తడపనేని(బెజవాడ శ్రీను), శ్రీధర్, రమేష్ మల్లరపు, రమేష్ కొండ, కళ్యాణ్ కట్టమూరి తదితరులు కార్యక్రమంలో ప్రసంగించారు. తెలుగుదేశం అధికారంలోకి రావడం సామాజిక అవసరం అని, భావి తరాల భవిష్యత్ కాపాడేది ఒక్క తెలుగుదేశం మాత్రమే అని వక్తలు ప్రసంగించారు. అనూహ్య సంఖ్యలో ఎన్నారైలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.