ఇంట గెలిచి రచ్చగెలవడం అంత ఈజీకాదు, కానీ ఆయనకు సొంతమైంది. తెలుగు నేలపై జన్మించి, రాష్ట్రాలు, దేశాలు దాటుకుని, అగ్రరాజ్యంలో అడుగు పెట్టిన ‘జయరాం కోమటి’ అమెరికాలో తెలుగు గళం వినిపించడమే కాదు, తెలుగు పతాకను ఠీవీగా ఎగురవేస్తున్నారు. వ్యాపార వేత్తగా, రాజకీయ నాయకుడిగా, సామాజిక సేవా దురంధరుడిగా, మేధావిగా ఇలా అనేక రూపాల్లో, ఆయన తన ప్రతిభను చాటుకున్నా రు. ఏదేశ మేగినా ఎందు కాలిడినా అన్నట్టుగా, ‘జయరాం కోమటి’ తన సత్తా నిరూపించుకుంటున్నారు.
వివాద రహితునిగా, అశేష తెలుగు జనాలకు ఆప్త మిత్రుడిగా, ప్రతి ఒక్కరికీ తలలో నాలుకలా వ్యవహరి స్తూ, అందరితోనూ అన్నయ్య అని పిలిపించుకునే ‘జయరాం కోమటి’ పుట్టిన రోజు ఈ రోజు. ఆంధ్రప్రదే శ్లోని కృష్ణాజిల్లా మైలవరం మండలం, వెల్వడం గ్రామంలో 1956, సెప్టెంబరు 26న ఆయన జన్మించారు. ఉన్నత విద్య అంతా అమెరికాలోనే సాగింది. అక్కడే ఆయన వ్యాపార వేత్తగా ఎదిగారు. అగ్రరాజ్యంలో తెలుగు వారి సమస్యలను పరిష్కరించే క్రతువును భుజాన వేసుకున్నారు. ఈక్రమంలోనే ఆయన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అధ్యక్షులుగా ఉన్న సమయంలో విశేష సేవలు అందించారు.
అదేసమయంలో రాజకీయాలంటే మక్కువైన ‘జయరాం కోమటి’ తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో ప్రారంభించిన తెలుగు దేశంపార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు. ఆ పార్టీ ఎన్నారై విభాగానికి నాయకుడిగా పనిచేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కూడా ఉత్తర అమెరికాలో బాధ్యతలు వహించారు.
1994లో ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఉత్తమ వ్యాపార వేత్తగా ఆయన అవార్డును అందుకున్నారు. తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తానా అభివృద్ధికి.. తెలుగు వారి కి మేలు చేసే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడంలో జయరాంకు జయరామే సాటి అనిపించుకున్నారు. ముఖ్యంగా తాను పుట్టిన తెలుగు నేలకు విశేష కృషి సల్పారు.పేదలకు అనేక రూపాల్లో సేవలు అందించారు. విద్యని గూఢ గుప్తమగు విత్తమన్నట్టుగా ఆయన విద్యా రంగంలో అందించిన సహకారం ఎన్నో వేల మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు ప్రసాదించింది.
పాఠశాలల అభివృద్ధికి నిధులు సేకరించారు. డిజిటల్ విద్యను ప్రోత్సహించారు. ఆరోగ్య రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. వీధి బాలలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, వారిని సమున్నతంగా తీర్చిదిద్దారు.ఫెడరేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్కు 2004-05 వరకు అధ్యక్షులుగా, 2003-04 వరకు చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు.
ప్రజా సేవలో పునీతమవుతున్న ‘జయరాం కోమటి’ మరిన్ని సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆయన సేవలు మరింతగా పరిఢవిల్లాలని బావార్చి ఇండియన్ రెస్టౌరెంట్ అధినేత’ శ్రీకాంత్ దొడ్డపనేని’ ఆధ్యర్యంలో ఆయన అభిమానులు, తెలుగు వారు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.