టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలు దక్కిన సంగతి తెలిసిందే. మొదట 5గురు అభ్యర్థులను ప్రకటించిన జనసేనాని పవన్ కల్యాణ్ తాజాగా మరో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించారు. బీజేపీ, టీడీపీ విశాఖ సౌత్, అవనిగడ్డ, పాలకొండ సెగ్మెంట్లను జనసేన పెండింగ్‌లో పెట్టింది.
వంశీ కృష్ణ యాదవ్ పేరుపై అభ్యంతరాలు వచ్చాయి. దీంతో, వంశీ పేరును పవన్ హోల్డ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. పాలకొండకు పడాల భూదేవి పేరు పరిశీలనలో ఉందని, అవనిగడ్డ సెగ్మెంటుకు వల్లభనేని బాలశౌరీ, బండ్రెడ్డి రామకృష్ణ పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. బాలశౌరి పేరును అవనిగడ్డకు పరిశీలిస్తుండడంతో జనసేనకు కేటాయించిన బందరు పార్లమెంటు స్థానాన్ని పవన్ పెండింగ్ లో పెట్టారట.
జనసేన తరఫున లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు
కాకినాడ–తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్
జనసేన తరఫున అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు
*పిఠాపురం- పవన్ కళ్యాణ్
*నెల్లిమర్ల – లోకం మాధవి
*అనకాపల్లి – కొణతాల రామకృష్ణ
*కాకినాడ రూరల్ – పంతం నానాజీ
*రాజానగరం – బత్తుల బలరామకృష్ణ
*తెనాలి – నాదెండ్ల మనోహర్
*నిడదవోలు – కందుల దుర్గేష్
*పెందుర్తి – పంచకర్ల రమేష్ బాబు
*యలమంచిలి – సుందరపు విజయ్ కుమార్
*పి.గన్నవరం – గిడ్డి సత్యనారాయణ
*రాజోలు – దేవ వరప్రసాద్
*తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్
*భీమవరం – పులపర్తి ఆంజనేయులు
*నరసాపురం – బొమ్మిడి నాయక్
*ఉంగుటూరు – పత్సమట్ల ధర్మరాజు
*పోలవరం – చిర్రి బాలరాజు
*తిరుపతి – ఆరణి శ్రీనివాస్
*రైల్వే కోడూరు – డా.యనమల భాస్కరరావు