వచ్చే ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ ఇంకా ఎక్కడా ఎలాంటి అనౌన్స్మెంట్లు చేయలేదు. అం టే.. ఎవరిని రంగంలోకి దింపుతున్నాం.. మేనిఫెస్టో ఏంటి? వంటి విషయాలపై పవన్ ఎక్కడా ప్రకటించ లేదు. అయితే.. కొన్ని కొన్ని స్థానాల్లో మాత్రం నాయకులు తమకు తామే అనౌన్స్ చేసుకున్నారు. ఇలాం టి వాటిలో విజయవాడ వెస్ట్ సీటు ఒకటి. ఇక్కడ పోతిన వెంకట మహేష్ పోటీకి సై అంటున్నారు.
గత ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉన్నప్పుడు కూడాఈయన పోటీ చేశారు. అయితే.. ఓడిపోయారు. ఇక, ఇప్పు డు మాత్రం గట్టి పోటీ ఇచ్చేందుకు పోతిన మహేష్ రెడీగా ఉన్నారని జనసేనలో టాక్ నడుస్తోంది. ఎన్నిక ల సమయానికి టీడీపీతో పొత్తు పెట్టుకున్నా.. ఈ సీటు సేఫేనన్నది పోతిన వర్గం చెబుతున్న మాట. ఆది నుంచి కూడా జనసేనకు మంచి ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పోతిన వ్యవహరిస్తున్నారు. ఏ సమస్య తెరమీదికి వచ్చినా.. పోరాటం చేస్తున్నారు.
దుర్గమ్మ ఆలయానికి సంబంధించిన వెండి సింహాలు మాయమైనప్పుడు, అదేవిధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కొండ ప్రాంతాల వాసులకు తాగు నీటి సమస్య ఎదురైనప్పుడు.. పోతిన వారికి అండగా నిలిచారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌పై తరచుగా షాకింగ్ విమర్శలు చేస్తూ.. మీడియాలోనూ ఆయన నిలుస్తున్నారు. దీంతో పోతిన పేరు సర్వత్రా వినిపిస్తుండడం గమనార్హం.
ఇక, టీడీపీ విషయానికి వస్తే.. ఇక్కడ ఎవరికీ ఇప్పటి వరకు టికెట్ ప్రకటించలేదు. టికెట్ కోసం.. మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ప్రయత్నిస్తున్నా ఆయన అనారోగ్య సమస్యలతో ఈ సారి మండలికి పంపించే అవకాశం ఉందని టాక్. ఇక, నిన్న మొన్నటి వరకు ఈ పశ్చిమ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఒకరిద్దరు నాయకులు కూడా పార్టీ అధిష్టానం నిర్ణయానికే వదిలేశారు. మొత్తంగా చూస్తే.. పశ్చిమలో ఈ సారి.. వైసీపీ వర్సెస్ జనసేన ల మధ్యే పోరు ఉంటుందని.. జనసేన గెలుస్తుందని ఒక అంచనా అయితే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.