అల్లు అర్జున్, మెగా ఫ్యాన్స్ మధ్య ఏర్పిడిన వైరం రోజురోజుకు ముదిరిపోతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన మిత్రుడైన వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డికి అల్లు అర్జున్ మద్ధతు పలికాడు. శిల్పా రవిచంద్ర అడగకపోయినా.. అల్లు అర్జున్ సతీసమేతంగా నంద్యాల వెళ్లి అతని తరపున ప్రచారం చేయడం వివాస్పదం అయింది. ఆ తర్వాత మెగా, అల్లు వివాదం నలుగుతూనే ఉంది. రెండు వైపుల నుంచి ఎవరో ఒకరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూనే ఉన్నారు.
ఇటీవల అల్లు అర్జున్ ఓ సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ.. తన మనసుకు నచ్చితే ఎక్కడికైనా వస్తాను అంటూ పరోక్షంగా నంద్యాల ఇన్సిడెంట్ ను ఉద్దేశించి ఏవేవో కామెంట్స్ చేశాడు. అయితే తాజాగా అల్లు అర్జున్ కామెంట్స్ పై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పందించారు. అల్లు అర్జున్ ఏమైనా పుడింగా.. ఆయన స్థాయి మరచిపోయి మాట్లాడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అల్లు అర్జున్‌కి ఫ్యాన్స్ ఉన్నారా? నాకు తెలిసి ఉన్నదంతా మెగా ఫ్యాన్సే. మెగా కుటుంబం నుంచి విడిపోయిన వ్యక్తులు బ్రాంచీలుగానీ, షామియానా కంపెనీలు గానీ పెట్టుకుంటే మాకు తెలియదంటూ బొలిశెట్టి శ్రీనివాస్ ఎద్దేవ చేశారు. అసలు మెగా ఫ్యాన్స్ లేకపోతే అల్లు అర్జున్ ఎవరు? నేను పెద్ద పుడంగిని.. నాకు ఇష్టమైతేనే వస్తా అంటే ఎవడికి కావాలి? నిన్నేమైనా రమ్మని పిలిచారా? నువ్వు వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? అంటూ బొలిశెట్టి ప్రశ్నించారు.
21 చోట్ల నిలబడితే 21 నెగ్గాం మేము. నువ్వు వెళ్లిన ఒక్క సీటు కూడా ఓడిపోయింది. 2009లో నరసాపురంలో మీ నాన్న అల్లు అరవింద్ ఎంపీగా నిలబడితే నువ్వు నెగ్గించలేదంటూ అల్లు అర్జున్ పై బొలిశెట్టి సెటైర్స్ పేల్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.