• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వైఎస్ జగన్ పెళ్లిరోజు.. వైర‌ల్ గా మారిన రోజా ట్వీట్‌!

admin by admin
August 28, 2024
in Andhra, Politics
0
0
SHARES
265
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి పెళ్లిరోజు నేడు. 1996 ఆగ‌స్టు 28న ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి కుమార్తె అయిన‌ భారతి రెడ్డిని జ‌గ‌న్ వివాహం చేసుకున్నారు. పెళ్లి రోజు సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు మ‌రియు అభిమానులు సోషల్ మీడియా ద్వారా జగన్-భారతి దంప‌తుల‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అయితే అంద‌రి గురించి ప‌క్క‌న పెడితే.. వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి రోజా సెల్వమణి జ‌గ‌న్ దంప‌తుల‌కు విషెస్ చెబుతూ ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. నిజానికి ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత రోజా క్రియాశీలక రాజకీయాలకు, పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో కూడా క‌నిపించ‌డం లేదు. ఫ్యామిలీతోనే ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతున్నారు.

అలాగే త‌మిళ‌నాడులో వ‌రుస‌గా ప‌లు దేవాల‌యాల‌ను సంద‌ర్శిస్తూ.. అక్క‌డి మీడియాకు ఫోక‌స్ అవుతున్నారు. దీంతో రోజా వైసీపీ గుడ్ బై చెప్పేసి తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. అంతేకాదు కోలీవుడ్ స్టార్ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం(టీఎంకే) పార్టీలో రోజా చేర‌బోతున్నార‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ వార్త‌ల‌పై రోజా స్పందించ‌లేదు. కానీ తాజాగా త‌న ఎక్స్ ఖాతా ద్వారా `ఏళ్ళన్నీ గడచినా చెదరని మీ అనుబంధం… ఇలాగే కలకాలం సాగాలని ఆశిస్తూ…!! అన్నా వదినలకి హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు` అంటూ జ‌గ‌న్‌-భార‌తి క‌లిసున్న ఫోటోను రోజా పోస్ట్ చేసింది. దీంతో ఇప్పుడు రోజా ట్వీట్ కాస్త వైర‌ల్ గా మారింది. జ‌గ‌న్ పై ఉన్న అభిమానంతో రోజా విషెస్ చెప్పారా..? లేక‌ పార్టీ మార్పుపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టడం కోసం ట్వీట్ చేశారా..? అన్న‌ది మాత్రం తేలలేదు.

ఏళ్ళన్నీ గడచినా చెదరని మీ అనుబంధం… ఇలాగే కలకాలం సాగాలని ఆశిస్తూ…!! అన్నా వదినలకి హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు 💞#weddinganniversary pic.twitter.com/fgsnPKhpkG

— Roja Selvamani (@RojaSelvamaniRK) August 28, 2024

Tags: Former minister RojaJagan Wedding AnniversaryRK RojaRoja Selvamaniys bharathi reddyys jaganYS Jagan Mohan ReddyYSRCP
Previous Post

జగన్ ఫారిన్ టూర్ కు కోర్టు ఓకే.. షెడ్యూల్ ఇదే

Next Post

అల్లు అర్జున్ ఏమైనా పుడింగా.. జ‌న‌సేన ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్య‌లు!

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Andhra

గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని

June 15, 2025
Andhra

ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!

June 15, 2025
Andhra

కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?

June 14, 2025
jagan
Andhra

మాది రైతు రాజ్యం: జ‌గ‌న్ సెల్ఫ్ గోల్‌

June 14, 2025
Load More
Next Post

అల్లు అర్జున్ ఏమైనా పుడింగా.. జ‌న‌సేన ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్య‌లు!

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra