జనసేన పార్టీకి తలనొప్పిగా మారిన తిరుపతి అసెంబ్లీ స్థానంపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకం గా దృష్టి పెట్టారు. శుక్రవారం అర్ధరాత్రి.. ఆయన ఇక్కడి నేతలతో ఫోన్లో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇక్కడి టికెట్‌ను స్థానిక జనసేన నాయకులు ఆశించారు. లేకపోతే.. పొత్తులో భాగంగా టీడీపీకి అయినా.. కేటాయించాలని డిమాండ్ చేశారు. కానీ, ఇక్కడి టికెట్‌ను వైసీపీ నుంచి కొన్ని రోజుల ముందు జనసేన తీర్థం పుచ్చుకున్న చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఈ టికెట్‌ను దక్కించుకున్నారు.
దీంతో కేడర్ పూర్తిస్థాయిలో స్తంభించిపోయింది. ఎట్టి పరిస్థితిలోనూ ఆరణికి సహకరించేది లేదని.. గత 20 రోజులుగా భీష్మించుకుని నాయకులు కూర్చున్నారు. దీనిపై ఇప్పటికే నాగబాబు, నాదెండ్ల మనోహర్ వంటివారు.. సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. క్షేత్రస్థాయిలో బుజ్జగింపుల పర్వానికి తెరదీసినా.. ఫలితం దక్కలేదు. ఎక్కడిపరిస్థితి అక్కడే నిలిచిపోయింది. దీంతో నేరుగా పవన్ జోక్యం చేసుకునే పరిస్థితి వచ్చింది. కీలక నాయకులకు పవన్తాజాగా సర్దిచెప్పారు.
ఆరణిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని.. అందరూ కలసి కట్టుగా పనిచేయాలని ఆయన దిశాని ర్దేశం చేశారు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక.. నాయకులకు న్యాయం చేస్తామని అన్నారు. ముఖ్యంగా జనసేన నాయకుడు కిరణ్ రాయల్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మలతో పవన్ చర్చించా రు. ఆరణికి సహకరించాలని సూచించారు. దీనికి వారు.. ఓకే చెప్పారని సమాచారం. దీంతో ఇప్పటి వరకు జనసేనకు తలనొప్పిగా ఉన్న తిరుపతి అసెంబ్లీ స్థానంలో సమస్యలు తొలగి పోయాయని పార్టీ నాయకులు చెబుతున్నారు.