ఏపీ అధికార పార్టీ వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు ఆశ్చర్యంగా ఉంటున్నాయి. జగన్‌ను ధిక్కరించార నో.. లేదా పార్టీ ప్రభుత్వ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారనో.. కీలక నేతలను పార్టీ అధిష్టానం పక్కన పెట్టేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే.. ఇలా చేయడం ద్వారా.. పార్టీకి వచ్చే లబ్ధి లేదని అంటున్నా రు పరిశీలకులు. 2019లో ఉన్న పరిస్థితి 2024 నాటికి ఉండబోదని కూడా చెబుతున్నారు. అప్పట్లో వైసీపీపై ఉన్న అంచనాలు, జగన్ పాదయాత్ర వంటివి ప్రభావితం చేశాయి.
సో.. దీంతో వైసీపీ మొత్తంగా జగన్‌పైనే ఆధారపడింది. ఆయన ఫొటో చూసుకునే పార్టీ అధికారంలోకి వచ్చిందనే విశ్లేషణలు ఉన్నాయి. అయితే.. ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ నాలుగేళ్ల పాలనలో సీఎం జగన్ పాలనపరంగా కేవలం ఒకవైపే చూస్తున్నారనే వాదన ఒక వర్గం నుంచి వినిపిస్తోంది. ఇక ప్రత్యర్థి పార్టీలైతే…. రాష్ట్రానికి రాజధాని లేదు. పెట్టుబడులు రావడం లేదు. ఉపాధి లేదు. ఉద్యోగాలు అంతకుమించి లేవు అంటూ జగన్ పాలనపై పెదవి విరుపులు.. విరుస్తున్నాయి.
ఇలాంటి సమయంలో కీలక నేతలను వదులుకునే పరిస్థితి రావడం వైసీపీలో చర్చకు అవకాశం కల్పిం చింది. గత ఎన్నికల మాదిరిగా కాకుండా 2024 ఎన్నికలు పూర్తిగా ఎమ్మెల్యే అభ్యర్థుల ఇమేజ్‌పైనే ఆధార పడి ఉంటుంది. ఇలాంటి కీలక సమయంలో ప్రజల్లో ఇమేజ్ ఉన్న నాయకులను, బలమైన గళం ఉన్న నేతలను పార్టీ వదులుకోవడం ఎంత వరకు సమంజసమనేది ప్రధాన ప్రశ్న.
ఇప్పుడున్న పరిస్థితి వ్యతిరేకతను కూడా అనుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే.. ఇప్పటి వరకు ఆదిశగా పార్టీ చేస్తున్న ప్రయత్నాలు లేకపోగా.. మరింత వ్యతిరేకత పెరిగేలా.. పెంచుకు నేలా అడుగులు వేయడం చర్చకు దారితీస్తోంది. రాష్ట్రంలో సుమారు.. 50 నుంచి 70 నియోజకవర్గాల్లో నాయకులు ఆయా రాం! గయా రాం! అన్నట్టే ఉన్నారు. మరి పార్టీకి మూలస్తంభాల్లాగా.. గతంలో పాదయాత్ర నుంచి ఇప్పటి వరకు ఉన్నవారిని సముదాయించకుండా.. వదులుకోవడం వైసీపీకి పెను విఘాతమేనని అంటున్నారు పరిశీలకులు.