“సార్‌కు కూడా ఇలా జరిగితే.. పార్టీ పరువే కాదు.. ప్రభుత్వ పరువూ పోతుంది. ఏం చేయాలి?“ ఇదీ.. ఇప్పుడు వైసీపీ సీనియర్ల మధ్య వినిపిస్తున్న గుసగుస. అంతేకాదు.. ఈ విషయం లో ఏం చెప్పాలా? అని వారు తర్జన భర్జన పడుతున్నారు. ఇంతకీ విషయంలోకి వెళ్తే.. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లు ఇద్దరూ కూడా కరోనా బారిన పడ్డారు. నిజానికి కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌ల సమయంలో ఈ ఇద్దరు నాయకులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు.
కరోనా సింప్టమ్స్ కనిపించగానే రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు వెళ్లి సేఫ్ గా ఉన్నారు. అయితే.. ఇటీవల కాలంలో నిర్వహించిన సభలు.. సమావేశాలు.. నేతలతో ఇంటరాక్షన్ నేపథ్యంలో చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కూడా కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు ఇదే విషయం వైసీపీలో చర్చగా మారింది. చంద్రబాబు, లోకేష్‌లు ఎన్ని జాగ్రత్తలో తీసుకున్నా.. కరోనా వచ్చిందని.. వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు వారి ఫోకస్ అంతా కూడా సీఎం జగన్‌పైనా.. ఇతర కీలక నేతలపైనా.. చర్చ సాగుతుండడం గమనార్హం.
ఎందుకంటే.. నిరంతరం.. తాడేపల్లిలోనే ఉండే.. ప్రభుత్వ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కరోనా బారిన పడ్డారనే వార్తలు వచ్చాయి. దీంతో సీఎం జగన్ విషయం వారిని కలవరపెడుతోంది. “మా నాయకుడు మాస్కు కూడా పెట్టుకోడు. అయితే.. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. ఇప్పుడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలోనూ సింప్టమ్స్ కనిపించాయి. సో.. ఇప్పటికైనా.. మా నాయకుడు మాస్కు పెట్టుకుంటే బెటర్“ అని ఒకరిద్దరు నేతలు వ్యాఖ్యానించారు.
మరికొందరు మాత్రం జగన్ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. తాడేపల్లి కార్యాలయంలో నిత్యం శానిటైజేషన్ చేస్తున్నారని.. ఎవరువెళ్లినా.. టెంపరేచర్ చేస్తున్నారు.. మాస్కులు ఇస్తున్నారు. శానిటైజేషన్ చేస్తున్నారు. సో.. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాక .. తాడేపల్లి కార్యాలయంలో ఎలాంటి కరోనా భయాలు అవసరం లేదు.. అని చెబుతున్నారు. అయినప్పటికీ.. ప్రస్తుతం చంద్రబాబు, లోకేష్, సజ్జల వంటివారికి పాజిటివ్ రావడంతో నేతలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. మరి ఏం చేస్తారో చూడాలి.