• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ సర్కార్ రోజువారీ టీ, బిస్కెట్ల ఖర్చెంతో తెలిస్తే షాకే

చాయ్, బిస్కెట్ల కోసం...ఏడాదికి రూ.8 కోట్లు ఖర్చుపెడుతున్న వైనం

admin by admin
July 5, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
964
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఖజానాలోని నిధులు నీళ్లలా ఖర్చు పెడుతున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ పర్యటనల నుంచి మొదలు…ఇతరత్రా అనవసర ఖర్చులతో ఖజానాకు చిల్లు పడుతోందని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక, తాజాగా ఏడాదికి టీ, బిస్కెట్లపై జగన్ సర్కార్ దుబారా చేస్తోందంటూ  సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి గణాంకాలతో సహా వెల్లడించారు. రాష్ట్ర ప్రొటోకాల్‌ శాఖలో నిధుల దుర్వినియోగం జరిగిందని గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఆయన లేఖ రాశారు.

ప్రభుత్వంలోని ప్రముఖుల అధికార లేదా అనధికార పర్యటనల సందర్భంగా బస, భోజనం, రవాణా వంటి వ్యవహారాలను ఈ శాఖ పర్యవేక్షిస్తుందని, ఆ శాఖ ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేసిందని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. బడ్జెట్‌ పద్దు 132 కింద ఇతర ఖర్చుల పేరుతో ఈ రూ.8 కోట్ల లెక్క ఉందని, సమావేశాల్లో టీ, బిస్కెట్ల కోసం ఏడాది కాలంలో రూ.8 కోట్లు ఖర్చు చేశారని వెల్లడించారు. ఈ లెక్కన రోజుకు సుమారు రూ.2 లక్షల ఖర్చయిందని అన్నారు.

ప్రొటోకాల్‌ డైరెక్టర్‌కు ప్రభుత్వ వాహనాలున్నప్పటికీ ప్రముఖులు వచ్చినప్పుడు ఖరీదైన వాహనాలను అద్దెకు తీసుకుంటున్నట్లు చూపుతున్నారని వెల్లడించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి కార్ల అద్దె కోసం బడ్జెట్‌ పద్దు 134 కింద రూ.8.9 కోట్లు కేటాయించారని వివరించారు. ఈ రెండు పద్దుల్లో నిధుల దుర్వినియోగం జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నిధుల దుబారాపై విజిలెన్స్‌ లేదా ఏసీబీతో విచారణ జరిపించేలా ఆదేశించాలని గవర్నర్ కు రాసిన లేఖలో పద్మనాభ రెడ్డి కోరారు.

Tags: ap governmentap governorcomplaintletter to governorRs.8 crores per yeartea and snacks expenses
Previous Post

‘దృశ్యం’ కాంబినేషన్ మళ్లీ..

Next Post

June Epaper

Related Posts

Movies

మా నాన్న కాళ్లు ప‌ట్టుకోవాల‌నుంది.. మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌

May 24, 2025
Politics

కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?

May 24, 2025
Andhra

స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌

May 23, 2025
Andhra

25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!

May 23, 2025
Andhra

ఢిల్లీలో బాబు బిజీ బిజీ!

May 23, 2025
Andhra

కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?

May 23, 2025
Load More
Next Post

June Epaper

Please login to join discussion

Latest News

  • మా నాన్న కాళ్లు ప‌ట్టుకోవాల‌నుంది.. మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌
  • కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?
  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra