ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ గత ఎన్నికల్లో ఘోర పరాజయంపాలైన సంగతి తెలిసిందే. అయితే, ఓటమిపాలైన వెంటనే ఈవీంలపై జగన్ తీవ్ర ఆరోపణలు చేశఆరు. ఈవీఎంల వల్లే వైసీపీ ఓడిపోయిందని, అయినా తమ దగ్గర ఆధారాలు లేవని జగన్ చేసిన కామెంట్లపై ట్రోలింగ్ కూడా జరిగింది. ప్రజావ్యతిరేకత వల్లే ఆ పార్టీ ఓటమిపాలైందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డా జగన్ మాత్రం ఆ అభిప్రాయాన్ని గౌరవించడం లేదని విమర్శలు వచ్చాయి.
వైసీపీకి వ్యతిరేకంగా ఇచ్చిన ప్రజాతీర్పును అపహాస్యం చేస్తున్న జగన్ ఈవీఎంలపై నెపం నెట్టేసి పబ్బం గడుపుకుంటున్నారు. అంతేకాదు, చంద్రబాబు మాదిరి తాను కూడా అబద్ధపు హామీలు ఇచ్చి ఉంటే ఈపాటికి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని ఉండేవాడినేమో అంటూ జగన్ చేసిన తాజా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే జగన్ పై సోషల్ మీడియాలో తాజాగా మరోసారి ట్రోలింగ్ జరుగుతోంది. ఇంకా ఓటమి షాక్ నుంచి తేరుకోని జగన్ తానే గెలిచి ఉండేవాడినన్న భ్రమలో ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఓటర్లు మభ్యపెడితే ఓట్లు వేయరని, తమకు కావలసిన నేతను ఎన్నుకునే పరిపక్వత ఓటర్లకు ఉందని చురకలంటిస్తున్నారు. ఇదే ఓటర్లు, ఇవే ఈవీఎంలు 2019 ఎన్నికల్లో జగన్ ను గెలిపించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని కౌంట్లరు ఇస్తున్నారు. నియంతృత్వ ధోరణి, ఏకచత్రాధిపత్యం, ఎమ్మెల్యేలను, నేతలను, క్యాడర్ ను, బూత్ లెవల్ నేతలను పట్టించుకోకపోవడం వల్లే జగన్ ఓడిపోయారని, ఇకనైనా ఈవీఎంలను నిందించడం మాని ఓటమికి గల కారణఆలపై జగన్ దృష్టి పెడితే రాబోయే ఎన్నికల్లో కనీసం 20 సీట్లు అయినా వస్తాయని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.