ఏపీ సీఎం జగన్ ప్రదర్శించిన అతి తెలివి .. రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేయడం ఖాయమని అంటు న్నారు పరిశీలకులు. కేంద్రం ఇచ్చే డబ్బుల కోసం.. కేంద్రం నుంచి తెచ్చే అప్పుల కోసం.. అన్ని విధాలా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే 25 సంవత్సరాలకు సరిపడా మ ద్యం ఆదాయన్ని అప్పుగా చూపించి.. 7 వేల కోట్లు అప్పులు తెచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కడా లేని విధంగా చెత్తపై పన్నేసి.. 2 వేల కోట్లు అప్పుగా తెచ్చుకున్నారు.
ఇక, ఉద్యోగుల నియామకాలు చేయబోమని చెప్పి.. మరో రెండు వేల కోట్లు తెచ్చుకున్నారు. ఎడా పెడా పన్నులు బాదేస్తూ.. కేంద్రం దగ్గర మెప్పు పొందుతున్నారు. ఈ పరంపరంలో ఇప్పుడు రెవెన్యూ లోటు కింద 10 వేల కోట్లు తెచ్చుకున్నారు. తాజాగా ఈ ఏడాది రెవెన్యూ లోటు కింద ఏకంగా పది వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. అయితే.. దీనివెనుక అసలు కిటుకు కొంత ఆలస్యంగా వెలుగు చూసింది.
అసలు విషయం ఏమిటి అంతే ఈ డబ్బులు ఇవ్వడం వల్ల ఇక పై రాష్ట్రంలో చేపట్టే ఏ ప్రాజెక్టుకు.. ప్రస్తు తం నడుస్తున్న ప్రాజెక్టులకు కూడా.. కేంద్రం పైసా నిధులు ఇవ్వదు. ఈ మేరకు పది వేలరూపాయలు ఇస్తూ.. పెట్టిన కండిషన్ అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. అయినప్పటికీ.. ఫర్వాలేదు అనే రీతిలో జగన్ ప్రభుత్వం రూ.10 వేల కోట్లు తీసుకునేందుకు అంగీకరించింది. ఈ సొమ్ముతో ఏం చేస్తారనేది పక్కన పెడితే.. ఇకపై పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం లేకుండా పోతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
అదేవిధంగాకీలకమైన ఏడు ఉమ్మడి జిల్లాలకు వెనకబడిన జిల్లా ల స్పెషల్ అసిస్టెన్స్ ఫండ్ కూడా నిధులు రావని తేల్చేస్తున్నారు. అదే విధంగా రాజధాని అభివృద్ధికి.. కడప ఉక్కు ఫ్యాక్టరీకి కూడా నిధులుఇచ్చే పరిస్థితి లేకుండా పోతుందని అంటున్నారు. అంటే.. మొత్తంగా ఈ 10 వేల కోట్లతో కేంద్రం ఏపీని అటకెక్కించేస్తోంది. మరి.. దీనికోసం కక్కుర్తిపడిన సీఎంజగన్ రాష్ట్రానికి మేలు చేస్తున్నట్టా..? కీడు చేస్తున్నట్టా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.