ఆంధ్రప్రదేశ్ లో 01.04.2020 నాటికి మొత్తం 47.17 టన్నుల బంగారు వనరులున్నాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే. ఇండియన్ మినరల్స్ ఇయర్ బుక్ 2021 ప్రకారం ఏపీలోని వివిధ ప్రాంతాల్లో GSI నిర్వహించిన బంగారు పరిశోధనల ప్రకారం, రామగిరి బంగారు క్షేత్రం, పెనకచెర్ల బంగారు క్షేత్రం, జోనగిరి స్కిస్ట్ బెల్ట్, చిగరగుంట – బిసనత్తం బంగారు బెల్ట్‌కు దక్షిణాన ఉన్న బిసనత్తం నుండి బంగారు నిల్వలున్నాయని తేలింది.
ఈ నేపథ్యంలోనే జగన్ పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సెటైరికట్ ట్వీట్ చేశారు.
‘‘వైఎస్ఆర్సిపి అడ్వంచరస్ ప్రెజెంట్స్ జగనన్నాస్ గోల్డ్’’ అంటూ జగన్ పై పవన్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. నౌ ఓన్లీ టాస్క్ సెర్చింగ్ ఫర్ గోల్డ్ అంటూ మోసగాళ్లకు మోసగాడులో నట శేఖర కృష్ణలాగా జగన్ పలుగు, పార పట్టుకొని కౌబాయ్ గెటప్ లో ఉన్న కార్టూన్ ను పవన్ షేర్ చేశారు. కెజిఎఫ్ గెట్ రెడీ.. హియర్ కమ్స్ జెజిఎఫ్ అంటూ జగన్ పై పవన్ పంచ్ లు వేశారు.
దీంతో, జగన్ పై సోషల్ మీడియాలో జనసైనికులు ట్రోలింగ్ మొదలెట్టారు. రాఖీ భాయ్ లాగా జగ్గూ భాయ్ అక్కడి బంగారం మొత్తం కొల్లగొట్టి అమెరికాకు తరలిస్తారంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక, జెజిఎఫ్ లో బంగారం తవ్వి తీయడానికి వాలంటీర్లను బానిసలుగా వాడుకుంటూ…వారికి తానే టార్చ్ బేరర్ ను అని బిల్డప్ కూడా ఇస్తారేమో అంటూ పంచులు వేస్తున్నారు. హాలీవుడ్ మూవీ మెకన్నాస్ గోల్డ్ మాదిరి ఇది టాలీవుడ్ మూవీ జగన్నాస్ గోల్డ్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలలో జిఎస్ఐ బంగారంపై నిర్వహించిన పరిశోధనల ప్రకారం రామగిరి బంగారు క్షేత్రం, పెనకచెర్ల బంగారు క్షేత్రం, జోనగిరి పలకల బెల్టు, చిగురుగుంట దక్షిణానికి ఉన్న బినత్తం బంగారు బెల్ట్లలో బంగారు నిక్షేపాలు కనిపించాయి. ఎంఎండిఆర్ చట్టం, 2015 అమలు తర్వాత వాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు.