ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. అదేంటో ఏ ముఖ్యమంత్రికి లేనట్టు… జగన్ మాత్రమే సడెన్ టూర్లకు ఢిల్లీ వెళ్తుంటారు. విజయవాడ నుంచి హస్తినకు ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలవనున్నారట. అంటే అచ్చంగా కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తున్నారు.
అందరు ఢిల్లీ వెళ్తే ఆయా శాఖ వారితో ప్రత్యేక సమావేశాలు అవుతుంటారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం తనకు సంబంధించిన ఏ వినతి అయినా అమిత్ షాకే ఇస్తుంటారు. రేపు రాత్రి 9 గంటలకు అమిత్ షాతో మీటింగ్ ఉంటుంది.
ఇక టూర్ సంగతి పక్కన పెడితే… ఎక్కడికైనా బాబు ప్రత్యేక విమానంలో వెళ్తాడు అని ప్రచారం చేసిన సాయిరెడ్డి… మరి జగన్ మాత్రం ఎపుడూ ప్రత్యేక విమానం ఎందుకు ఎక్కుతున్నాడో మాట్లాడరు. చివరకు రఘురామరాజు మీద కంప్లయింట్ చేయడానికి కూడా 5 మంది ఎంపీలు ప్రత్యేక విమానమే ఎక్కిన విషయం కూడా జనం మరిచిపోలేదు. చేసే తప్పులన్నీ చేసి ఎంత ధైర్యంగా ఇతరుల తప్పులను ఎత్తిచూపడంలో వైసీపీ నేతల తర్వాతే ఎవరైనా. పోనీ అంతా చేస్తే పరిశ్రమలు ఏమైనా తెస్తారా అంటే అదీ లేదు.
ఇప్పటివరకు ఏపీ నుంచి పరిశ్రమలు వెనక్కుపోవడమే గాని కొత్తవి వచ్చింది లేదు. లులు గ్రూపు, అదానీ, అంబానీ వంటి పెద్ద పారిశ్రామిక వేత్తలు కూడా జగన్ రాజ్యంలో పెట్టుబడులు అంటే వెనక్కు తగ్గే పరిస్థితి. మరి వచ్చే రెండేళ్లలో అయినా పెట్టుబడులు ఎలా తెస్తారో వేచిచూడాలి. అంబానీ మనిషి నత్వానికి రాజ్యసభ సీటు ఇస్తే చివరకు అంబానీ కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాకపోవడం విశేషం.