రావణా... అద్భుతం, విరాటపర్వం టీజర్ కుమ్మేసింది


రానా దగ్గుబాటి ...వేణు ఉడుగుల  అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విరాటపర్వం టీజర్ వచ్చేసింది. రోమాలు నిక్క బొడుచుకునే బ్యాగ్రౌండ్ తో టీజర్ ఆకట్టుకుంటోంది. అయితే సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ టీజర్ లో ఆమె కనిపించలేదు.  

1990 నాటి నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన రానా, కామ్రేడ్ రావణ పాత్రలో అద్భుతంగా లీనమైపోయారు. డాక్టర్ రవి కుమార్  మావోయిస్టు నాయకుడు రావణుడు కావడానికి బలమైన కారణం ఉంది. అతని పాత్ర "ఈ దేశం ముందు ఒక ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది... సత్యన్వేషణలో నెతురోడిన  హ్రదయం అతనిది ... డాక్టర్ రవిశంకర్ అలియాస్ కామ్రేడ్ రావణ" అంటూ సినిమాను ఒక్క లైన్లో వివరించే ప్రయత్నం చేశారు.
సాంకేతికంగా మంచి విలువలతో ఈ సినిమా నిర్మాణం అవుతున్నట్లు తెలుస్తోంది. ఉత్తమమైన పనితో టీజర్ బాగా ఆకట్టుకుంటుంది. సురేష్ బొబ్బిలి యొక్క BGM ఈ సినిమాకు ప్రధాన బలం కానుంది.

సుధాకర్ చెరుకూరి  సురేష్ బాబు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా  2021 లో థియేటర్లలోకి రానుంది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.