ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కోరి కష్టాలు తెచ్చుకున్నారా అంటే అవుననే అంటున్నారు కొందరు. సుప్రీంకోర్టోలో రెండో స్థానంలో ఉన్న వ్యక్తిపై ఫిర్యాదు చేయడం, దానిని మీడియాలో ఘనతగా చెప్పుకోవడంతో ఆయన ఇరుక్కున్నారని చెబుతున్నారు. నిజానికి న్యాయవ్యవస్థ చాలా వరకు రహస్యంగానే ఉండాలి. ఎందుకంటే అది ప్రతి ఒక్కరికీ ప్రొటెక్టర్. ఆ వ్యవస్థను అన్ని భావోద్వేగాలకు అతీతమైనది తీర్చిదిద్దారు.అందుకే సోషల్ మీడియాలు ఇంత విస్తృతం అయినా వాటికి సోషల్ మీడియా అక్కౌంట్లు అనేవి ఉండవు. ఎందుకంటే వాటికి ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది.
న్యాయవ్యవస్థలోను కొందరు అవినీతికి పాల్పడిన ఉదాహరణలు ఉన్నా… ఇప్పటికీ ప్రజలకు అండగా ఉన్న వ్యవస్థ, అందరికీ అందుబాటులో ఉన్న వ్యవస్థ న్యాయయవ్యస్థే. భారత రాజ్యాంగం న్యాయవ్యవస్థను చాలా పటిష్టంగా తీర్చిదిద్దబట్టే ఈరోజు మన దేశం నియంతల రాజ్యం అవలేదు. ఎక్కడికక్కడ కట్టడి రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ జగన్ న్యాయవ్యవస్థ పై ఆగ్రహంగా ఉన్నారు. అదంటే ఆయనకు అసలు పడటం లేదు. దీంతో కొందరిపై ఫిర్యాదు చేయడమే కాదు, ఆ విషయాన్ని కూడా బయటపెట్టేశారు. బహిరంగ ఆరోపణలు చేశారు.
అయితే, ఇది కోర్టు ధిక్కరణ అనే విషయం ఆయన మరిచిపోయారు. దీంతో సీఎం జగన్ రెడ్డి కోర్టు దిక్కరణకు పాల్పడ్డారని సుప్రీంకోర్టులో ఒక పిటిషను దాఖలైంది. దానికింద జైలు శిక్ష కూడా పడొచ్చు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం… న్యాయవ్యవస్థలపై ఫిర్యాదు ఇవ్వచ్చుగాని దానిని బహిరంగ పరచకూడదు. జగన్ ఇది మిస్సయ్యారు. ఆయన ఇది పెద్ద సంచలనం అయి కోర్టులు ఉక్కిరిబిక్కిరి అవుతాయనుకున్నారు. కానీ వారు చాలా సహజంగా, సాధారణంగా ఉన్నారు. కొందరు నిపుణులు ఈ వ్యవహారం అనంతరం జగన్ రెడ్డిని హెచ్చరించారు. ఈ క్రమంలో తదుపరి పరిణామాల నుంచి తనను తాను కాపాడుకోవడానికి జగన్ ఢిల్లీ టూరు వెళ్తున్నారని అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.