ఈరోజు స్పెషల్ ఏంటి…
కార్తీక మాసం ప్రారంభం అంటారా…
అది కాదండీ బాబూ….
మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి రమణ చేసిన నానా ఆరోపణలు బజారును పెట్టారు కదా. అది కోర్టు దిక్కారం అని పలువురు న్యాయవాదులు జగన్ కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లడం తెలిసిందే కదా. ఆ పిటిషను ఈరోజు విచారణకు వచ్చిందండీ.
జస్టిస్ లలిత్ కుమార్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.అయితే, ఈ పిటిషను తాను విచారించలేనని, వేరే ధర్మాసనానికి పంపించాలని ఆయన ప్రధాన న్యాయమూర్తికి విన్నవిస్తూ తప్పుకున్నారు. కారణం ఏంటయ్యా అంటే…. ఈ లలిత్ గారు గతంలో ఈ పిటిషన్లోని వాది ప్రతివాదుల్లో ఒక తరఫున లాయర్ గా పనిచేశారట. అది కూడా జగన్ తరఫున ఆయన వాదించారట. అందువలన తన తీర్పుపై అనవసర నిందలు పడతాయేమో అని విచారణ నుంచి పక్కకు తప్పుకున్నారు.
ఈ పిటిషను వేరే బెంచ్ ముందుకు వెళ్లనుంది. ఎటువంటి పక్కా ఆధారాలు లేకుండా దేశంలోనే సెకండ్ సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ NV రమణపై ఆరోపణలు చేశారని లాయర్లు GS మణి, ప్రదీప కుమార్, ఎస్కే సింగ్ సుప్రీంకోర్టులో పిల్ వేశారు.
ముఖ్యమంత్రి జగన్ పై విదేశాలకు డబ్బు అక్రమ తరలింపు, అవినీతి సహా 20కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయనీ… అవి చాలా తీవ్రమైన కేసులని వారు తెలిపారు. అలాంటి వ్యక్తిని కోర్టును ప్రభావితం చేయడానికే ఆరోపణలు చేశారని పిటిషనర్ల వాదన.