ప్రతి ఆంధ్రుడు ఓటు వేయకపోవచ్చు.
కానీ ప్రతి రైతు ఓటు వేస్తాడు.
ఎందుకంటే ఆంధ్రులందరూ ఆంధ్రలోనే ఉంటారనేం గ్యారంటీలేదు.
ఉన్నా ఓటేసేటపుడు ఉంటారని, ఉన్నా ఓటు వేస్తారని గ్యారంటీ లేదు
కానీ ప్రతి రైతూ ఊర్లోనే ఉంటాడు, ప్రతి రైతు ఓటు వేస్తాడు
రైతును చీదరించినోడు, రైతను అవమానించినోడు దేశంలో ఏ రాష్ట్రంలోను గెలిచిన దాఖలాల్లేవు.
అమరావతి ఉద్యమమే లేనపుడు పూటకోసారి వైసీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి ఉద్యమం లేదని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉద్యమం లేనపుడు మళ్లీ లేదని చెప్పాల్సిన అవసరం ఏముంటుంది.
రైతుల ఉద్యమం నిజం
ఆ ఉద్యమానికి ఏపీ ప్రజల మద్దతు ఉన్నదీ నిజం.
అందుకే ఆ మద్దతు అందరికీ తెలియకూడదు పాదయాత్ర చేస్తే అమరావతికి ప్రజలు నీరాజనం పడతారు అనే జగన్ సర్కారు అనుమతి ఇవ్వలేదు.
చివరకు కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుంటే ఉద్యమ పాదయాత్రకు జనం హాజరుకాకుండా పోలీసు వలయాలు ఏర్పాటుచేసి జనం కనిపించకుండా జగన్ రెడ్డి విఫలయత్నాలు చేస్తున్నారు.
ఎన్ని చేసినా ప్రజల మనసుల నుంచి అమరావతిని జగన్ తుడిచేయలేరు.
ఉద్యమ స్ఫూర్తి లేకుండానే అమరావతి రైతులు రెండు సంవత్సరాలు ఉద్యమం నడపగలరా? సాధ్యం కాదు. ఈ విషయం తెలుసుకోకుంటే జనం జగన్ ని మరిచిపోవడం ఖాయం.
విశాఖ రాజధాని ప్రకటించినా అక్కడ వైకాపా నాయకుల విధ్వంసం విశాఖ ప్రజలకు చిరాకు తెప్పిస్తోంది.
మీ రాజధాని వద్దు, మీరూ వద్దు అని విశాఖ ప్రజలు వైకాపా నేతలకు చెబుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
రైతులను అమరావతిలోనే కాదు, రాష్ట్రమంతా సరైన గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా ముంచుతున్న జగన్ రెడ్డి కి ఆయన మిత్రుడు కేటీఆర్ సలహా విస్తున్నారు… వింటే జగన్ పార్టీ కనీసం నిలబడుతుంది. లేకపోతే పార్టీకి భవిష్యత్తు లేకుండా పోతుంది.
ఆ సలహా ఏంటో కేటీఆర్ మాటల్లోనే వినండి
రైతుల ఎడ్ల బండి కింద మీ పార్టీ నలిగిపోతుంది గుర్తుపెట్టుకోండి..!@bandisanjay_bjp @Arvindharmapuri #Banbjp#Telangana #Hyderabad pic.twitter.com/xNILu50cba
— Kiran_ktrs (@ktr_kiran) November 12, 2021