యుగానికో రాక్షసుడు పుడతాడంటూ సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని విజయవాడకు వచ్చిన చంద్రబాబు తొలుత మీడియాతో మాట్లాడారు. “యుగానికో రాక్షసుడు పుడతాడు. జగన్ అలాగే పుట్టాడు. తల్లి అంటే ప్రేమ లేదు.. చెల్లి అంటే ప్రేమ లేదు.. ఓ బాబాయిని చంపించాడు.. మరో బాబాయిని జైలుకు పంపాడు“ అని తీవ్రస్తాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ ఇక్కడితో ఆగడు.. తన ఇంట్లోనే ఏదోకటి చేసుకుని.. మన మీదే ఆ నెపం నెట్టే ప్రయత్నం చేస్తాడని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ దళిత ద్రోహి!
జగన్ దళిత ద్రోహి అని ప్రచారం చేయాలని చంద్రబాబు పార్టీ ఎస్సీ నేతలకు పిలుపునిచ్చారు. జగన్‌వి నవరత్నాలు కావు నవమోసాలు అంటూ ఆయన విరుచుకుపడ్డారు. ‘‘గడప గడపకు వెళ్లాలన్నాడు.. స్టిక్కర్ వేయమంటున్నాడు. జగన్ ఫొటో ఉండాల్సింది ఇంటి తలుపుల మీద కాదు.. పోలీస్ స్టేషను గోడలపై ఉండాలి“ అని నిప్పులు చెరిగారు. “యర్రగొండపాలెంలో మనపైనే దాడి చేసి.. మనకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలనుకున్నారు’’ మండిపడ్డారు.
డ్రామాలు ముగిశాయి!
జగన్ కోడి కత్తి డ్రామా ఆడారని.. ఇప్పుడు ఆ డ్రామాలు ముగిశాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ కళ్లల్లో ఆనందం చూడడానికి కత్తితో పొడిచానని.. కోడికత్తి శీను చెప్పాడని తెలిపారు. కోడికత్తి శీనును ఐదేళ్లుగా జైల్లో మగ్గేలా చేస్తున్నారని.. ఏ మాత్రం అవకాశం ఉన్నా కోడికత్తి శీనును కూడా చంపేస్తారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. సలహాదారులుగా దళితులను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. వైస్ ఛాన్సలర్లుగా దళితులు పనికి రారా అంటూ నిలదీశారు.
నన్ను తిట్టి నాపైనే దాడులా?
‘‘యర్రగొండపాలెంలో నేనేమన్నాను…?. నేనేదో దళితులను విమర్శించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లోకేష్ జగన్‌ను తిడితే.. ఎస్సీలను తిట్టినట్టుగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నన్ను తిట్టి నాపైనే దాడులు చేస్తున్నారు“ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంత్రి సురేష్ బట్టలిప్పేసి.. రోడ్ మీదకు వచ్చి వీరంగం వేశాడని ఎద్దేవా చేశారు. అసలు బట్టలిప్పాల్సిన అవసరమేంటన్నారు. “నా మీద దాడి చేస్తే.. ఎన్ఎస్జీ కమాండోలతో కాల్పులు జరిగేలా ప్లాన్ చేశారు. ఇలాంటి పనులు చేసేవాడు ఓ మనిషా..? జగన్ సైకో’’ అంటూ చంద్రబాబు అన్నారు.
“He is a visionary..Idhi nenu cheppedhi kaadhu..Country lo unna peddha peddha leaders cheppe maata..Vallaki Chandrababu ghanatha,talent ento thelusu..Ikkada unna vallakante bayata vallake aayana value baaga thelusu”
Thalaiva Rajni about CBN ❤️????
Last line lo deep message undhi pic.twitter.com/jVEuOFgCpB
— VGS1100 (@VgowthamS) April 28, 2023