“ఇక, తప్పదు. నిన్నటిలా రేపు ఉండదు. మారి తీరాల్సిందే. లేకపోతే.. ప్రమాద ఘంటికల గణగణలలో పిచ్చెక్కి పోవడం ఖాయం.. “-ఇదీ.. పేరు చెప్పడానికి ఇష్టపడని అనేక మంది వైసీపీ నాయకులు సీఎం జగన్ గురించి చెబుతున్న మాట. గతంలో వైసీపీలో ఉండి. తర్వాత.. కొద్దికాలానికే బయటకు వచ్చిన ఎంవీ మైసూరారెడ్డి వంటివారు.. చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు.
“జగన్ లాగూలు వేసుకుంటున్నప్పటి నుంచి నాకు తెలుసు. కారుతున్న ముక్కుతో మా ఇంట్లో కూడా ఆడుకున్నాడు. అలాంటివాడికి శాల్యూట్ చేయాలట. సార్ అని సంబోధించాలట. మేమేన్నా.. అగౌరవంగా మాట్లాడుతున్నామా..? జగన్ గారు అనే పిలుస్తున్నాం. కానీ, పేరు పెట్టకుండా.. సార్ అనే పిలవాలట. ఇది ఒకరకంగా రాచరికం. అందుకే నాకు నచ్చలేదు. నాకే కాదు.. చాలా మందికి నచ్చదు. వారు సర్దుకుపోతున్నారు. రేపు ప్రత్నామ్యాయం దొరికితే.. అప్పుడు తెలుస్తుంది“ అని అప్పట్లో మైసూరా వ్యాఖ్యానించారు.
ఇప్పుడు అవే విషయాలను నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే, మేకపాటి చంద్రశేఖరరెడ్డి కూడా వ్యాఖ్యా నించారు. నా రాజకీయ అనుభవం ముందు.. జగన్ ఎంత? అనే మాట అనేశారు. అంటే.. అంతర్గతంగా నాయకులు .. జగన్ వైఖరితో ఎంత కుమిలిపోతున్నారనేది.. ఈ మాటలను బట్టి అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. చాలా మంది సీనియర్లు వైసీపీలో ఉన్నారు. జూనియర్లు అయితే.. ఓకే. కానీ.. సీనియర్ల మాటేంటి? ఇప్పుడు రెబల్స్‌గా మారిన వారిని చూస్తే.. ఇదే కనిపిస్తోంది.
నరసాపురం ఎంపీ రఘురామ.. జగన్ కన్నాముందుగానే రాజకీయాల్లోకి వచ్చారు. ఆనం రామనారాయణ రెడ్డి కూడా.. జగన్ కన్నాముందు నుంచి రాజకీయాలు చేశారు. అలాగే.. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కూడా..జగన్ కన్నాముందు నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. వంటివారు కూడా చాలా మోస్ట్ సీనియర్లు. కానీ, వారికి విలువ లేదు. జగన్ ఛాంబర్ లో వారికి సీటు కూడా ఉండదనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఇదే.. సగం వ్యతిరేకతకు కారణంగా మారింది.
అదేసమయంలో ఎంతో ఖర్చు పెట్టి రెండు లక్షల మంది ప్రజలను తమవైపుతిప్పుకొని.. ఓట్లు వేయించు కున్న ఎమ్మెల్యేలకు కనీస గౌరవం కూడా లేకుండా చేస్తే.. అది వారి మనోభావాలను దెబ్బతీసినట్టుకాదా? అసలు ఇప్పుడు ఉన్నతాధికారులు ఎవెరైనా.. ఎమ్మెల్యేలను గౌరవిస్తున్నారా? అనేది జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని పార్టీ ననాయకులు ఆఫ్‌ది రికార్డుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా.. ఆయన మారాలని అంటున్నారు.