జగన్మోహన్ రెడ్డిపై కేంద్ర మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన తండ్రి కోట్ల విజయభాస్కర రెడ్డి రెండుసార్లు సీఎంగా చేసినా తాను కేంద్రమంత్రిగా పనిచేసినా ఏనాడు డబ్బుకు ఆశపడలేదన్నారు. కానీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సీఎంగా ఉన్నపుడు జగన్ కోట్ల రూపాయలు సంపాదించినట్లు చేసిన ఆరోపణలు సంచలనంగా మారింది.
కర్నూలు జిల్లాలోని కోడుమూరు పంచాయితి ఎన్నికల సందర్భంగా కోట్ల నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతు జగన్ పై ఆరోపణలు చేశారు. పంచాయితి ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతల దౌర్జన్యాలకు తాను భయపడేది లేదన్నారు. టీడీపీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రజలు బాగుండటమే తనకు కావాల్సిందన్నారు.
ప్రజసేవే లక్ష్యంగా తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు కోట్ల చెప్పుకున్నారు. పేకాట, బెట్టింగులను ప్రోత్సహిస్తున్న మంత్రులు, వైసీపీ నేతలను అరెస్టు చేసే దమ్ము పోలీసులకు ఉందా అంటు నిలదీశారు.
వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో కోట్ల విజయభాస్కరరెడ్డి వల్ల కాంగ్రెస్ క్యాడర్ బాగా పెరిగింది. బలమైన నాయకులను తయారుచేశారాయన. ప్రతి ఒక్కరిని బాగా చూసుకున్నారు. ఆస్తులేమీ పెద్దగా సంపాదించుకోలేదు. ఎంతో ఉన్నతికి ఎదిగినా ఏమీ వెనకేసుకోలేదు.
అందుకే తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు ప్రారంభించిన ఇండోర్ స్టేడియానికి కోట్ల నిజాయితీకి మెచ్చి…. కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరు పెట్టారు. నిజానికి కాంగ్రెస్ కి తెలుగుగదేశానికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయినా తెలుగుదేశం ప్రభుత్వం కోట్ల వేరే పార్టీ అయినా కూడా ఆయనకు తగిన గౌరవం కల్పించింది.