అదృష్టమంటే దిల్ రాజుదే

అగ్ర నిర్మాత దిల్ రాజు జాక్ పాట్ కొట్టినట్లే. ఆయన తెలుగులో మరే నిర్మాతకూ దక్కని అవకాశాన్ని అందుకోబోతున్నారట. సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ డైరెక్టర్లలో ఒకడైన శంకర్‌తో ఆయన సినిమా చేయబోతున్నారట. మన రామ్ చరణే అందులో హీరో అన్న సమాచారం బయటికి వచ్చింది.

నిన్నట్నుంచి ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఈ వార్త బయటికి వచ్చినప్పటి నుంచి దిల్ రాజు గురించే పెద్ద చర్చ నడుస్తోంది. ఆయన శంకర్‌తో నిజానికి మూడేళ్ల ముందే సినిమా అనౌన్స్ చేశాడు.

కమల్ హాసన్ హీరోగా శంకర్ తీయాల్సిన ‘భారతీయుడు’ సీక్వెల్ దిల్ రాజు చేతికే వచ్చింది. ఈ సినిమా ఆయన నిర్మాణంలోనే అనౌన్స్ అయింది. కానీ ఏం జరిగిందో ఏమో ఆ సినిమా నుంచి దిల్ రాజు తప్పుకున్నాడు. తర్వాత లైకా ప్రొడక్షన్స్ వాళ్లు ఆ ప్రాజెక్టును తమ చేతికి తీసుకున్నారు.

అప్పుడేమో అందరూ దిల్ రాజుకు ఇలా జరిగిందేంటి అని వాపోయారందరూ అదృష్టం రాజు తలుపు తట్టినట్లే తట్టి వెళ్లిపోయిందే అన్న కామెంట్లు కూడా వినిపించాయి. కానీ తర్వాత పరిణామాలు చూస్తే రాజకు మంచే జరిగింది అనిపించింది. ఎందుకంటే.. ‘ఇండియన్-2’ సినిమాకు మొదట్నుంచి ఏమీ కలిసి రావట్లేదు. ఎప్పటికప్పుడు ఆ సినిమాకు బ్రేక్ పడుతూనే ఉంది.

కమల్ మేకప్ సమస్య వల్ల, ఆయన పొలిటికల్ కమిట్మెంట్ల వల్ల.. ఆ తర్వాత సెట్లో క్రేన్ ప్రమాదం వల్ల, చివరగా కరోనా వల్ల ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయి. కరోనా బ్రేక్ తర్వాత కూడా సినిమా పున:ప్రారంభం కాలేదు. ఈ సినిమా విషయంలో నిర్మాతలు, దర్శకుడికి విభేదాలని కూడా ప్రచారం జరుగుతోంది.

దాని సంగతలా వదిలేస్తే ఆ సినిమాను వదులుకుని రాజు మంచి పనే చేశాడన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు రాజు.. శంకర్‌, రామ్ చరణ్ కలయికలో క్రేజీ పాన్ ఇండియా మూవీని ప్రొడ్యూస్ చేసే అవకాశం దక్కించుకున్నాడంటే ఆయన అదృష్టమే అదృష్టం అంటున్నారంతా.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.