జనాభా అసమతుల్యానికి, కుల అసమతుల్యానికి తేడా తెలియని వాడు సీఎం అయితే ఇలానే ఉంటుంది. డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే కుల అసమతుల్యం కాదని తెలిసి కూడా కుల విద్వేషం రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు.అందుకే నిన్ను ఫేక్ సీఎం అనేది. నువ్వు ఒకే సామాజిక వర్గానికి ముఖ్యమైన 850 పోస్టులు కట్టబెట్టి బడుగు, బలహీన వర్గాలకు ముష్టి పడేసావ్ చూసావా అది కుల అసమతుల్యం. ఒక్క నిరుద్యోగికైనా ఉద్యోగం ఇచ్చావా? ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేసావా? ఇంకెంత కాలం నీ దరిద్రపు కుల రాజకీయం.
- నారా లోకేష్
ఇది లోకేష్ ట్వీట్. జనాల అమాయకత్వాన్ని టార్గెట్ చేసి, ముఖ్యమంత్రి చెబితే సోషల్ మీడియాలో ఏం చెప్పినా నమ్మేస్తారు అన్న ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్ ఇంగ్లిష్ పదానికి తప్పు అర్థం చెప్పారు. కోర్టులో పడిన పిటిషను వేరు, జగన్ చెప్పిన విషయం వేరు. సరే ఇవన్నీ పక్కన పెడితే అమరావతి ఒక కుల రాజధాని అని నిస్సిగ్గుగా జగన్ అబద్ధం చెప్పారు అంటున్నారు అమరావతి రైతులు. గవర్నమెంటు లెక్కల ప్రకారం అమరావతి ప్రాంతంలో ఏ కులం జనాభా ఎంతుందో కింద బొమ్మలో చూడొచ్చు.