వ్యాక్సిన్ పై కేంద్రానికి లేఖ రాసిన జగన్.
ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్ కేటాయించడంపై ఆందోళన వ్యక్తంచేసిన జగన్ రెడ్డి.
వ్యాక్సిన్ లు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వద్దే ఉండాలని వినతి.
ప్రైవేటు చేతికి వ్యాక్సిన్లు ఇస్తే బ్లాక్ మార్కెట్ చేస్తారని ఆందోళన.
తాజాగా ఈ అంశాలతో కేంద్రానికి లేఖ రాసిన జగన్.
అయితే…. జగన్ లేఖపై మధ్య తరగతిలో అసహనం వ్యక్తమవుతోంది.
గవర్నమెంట్ల దగ్గరే వ్యాక్సిన్లు ఉంటే అయితే స్లమ్ లో పంచినట్టు పెద్ద పెద్ద క్యూలు పెట్టి సమాచారం లేకుండా వేస్తారని… రాజకీయ నాయకులు తమ అవసరమైన వారికి వ్యాక్సిన్లను ఓటు బ్యాంకుగా వాడుకుంటారని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
వ్యాక్సిన్ ప్రైవేటు ప్రభుత్వం రెండు చోట్ల దొరికితేనే బ్లాక్ మార్కెట్ ఉండదు అన్నది ప్రజల అభిప్రాయంగా తెలుస్తోంది.
ప్రభుత్వాల చేతిలో వ్యాక్సిన్లను ఎమ్మెల్యేలు మేనేజ్ చేస్తారు. అదే ప్రైవేటులో ఉంటే కొనుక్కోగలిగిన వారు అక్కడికి వెళ్తారు. కొనుక్కోలేని వారు గవర్నమెంటుకు వెళ్తారు. అపుడు బ్లాక్ మార్కెట్ కు అవకాశం ఉండదు అని పలువురి అభిప్రాయం.
అధికారం ఎపుడూ తనవద్దే కేంద్రీకృతం కావాలి, వ్యాక్సిన్లను ఓటు బ్యాంకు భద్రపరుచుకునేందుకు వాడుకోవాలి అనే ఉద్దేశంతోనే జగన్ లేఖ రాసి ఉంటాడని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. వ్యాక్సిన్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయమే మంచిది… వ్యాక్సిన్ అన్ని వర్గాలకు అందుబాటులో ఉండాలి అంటున్నారు.