అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలంలో వరద బాధితులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్ షోలో సీఎం జగన్ పై చంద్రబాబు సెటైర్ల వర్షం కురిపించారు. సీఎం జగన్ కోడికత్తి కమల్ హాసన్ లాగా మళ్లీ యాక్షన్ మొదలు బెట్టాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వరద బాధితులను పరామర్శించిన జగన్…మళ్లీ పిల్లల్ని ఎత్తుకోవడం..ఆడబిడ్డల తలపై చెయ్యి పెట్టి నిమరడం…వంటి ట్రిక్ లు మొదలుబెట్టాడని చురకలంటించారు.
తాను ట్రాక్టర్ ఎక్కానని ఆయన కూడా ఎక్కాడని, ఇలా డ్రామాలు ఆడేవాళ్లని నమ్మకూడదని ప్రజలకు పిలుపునిచ్చారు. బాబాయిని చంపి తనపైకి నెట్టారని, రేపు ఎవర్నో చంపి తనపైకి నెడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజానికి సేవ చేసే ఉద్దేశం లేని జగన్ వంటి వారితో చాలా ప్రమాదమని చంద్రబాబు విమర్శించారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్ర మెడలు వంచుతానన్న జగన్, ఇప్పుడు తన మెడ, తల తానే దించుకున్నాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
పోలవరం కోసం కేంద్రానికి లేఖలు రాస్తూనే ఉంటాను.. నాకు ఓట్లు వేస్తూనే ఉండండి అన్న చందంగా జగన్ తీరు ఉందని మండిపడ్డారు.
25 మంది వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగి వస్తుందని, అలా చేసే దమ్ము వారికి లేదని అన్నారు. పోలవరం పూర్తి చేయడానికి ఒక వ్యూహం, ముందుచూపు ఏమీ లేదని, చేతగాకపోతే జగన్ తోసహా ఎంపీలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత తనపైనే వేసుకుంటానని అన్నారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక, నేరుగా పోలవరం జిల్లానే ఏర్పాటు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందులో పోలవరం ముంపు మండలాలన్నీ ఉంటాయని, ముంపు ప్రాంతవాసుల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా పని చేస్తానని భరోసానిచ్చారు. అమరావతి రైతులను వెయ్యి రోజులుగా రోడ్లపై వదిశారని, పోలవరం ముంపు ప్రజల్ని ఇప్పుడు బురదలో వేశారని అన్నారు. వైసీీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా పోరాడాలి. మీకు అండగా టీడీపీ ఉంటుందని చంద్రబాబు భరోసా కల్పించారు.
‘గోదావరి ముంపు ప్రాంతమైన కూనవరం మండల కేంద్రంలో ఇళ్ల పరిస్థితి ఇది. గ్రామంలో ఓ బాధితుడు తన ఇంటిని స్వయంగా కుటుంబ సభ్యులతో కలిసి శుభ్రం చేసుకుంటున్నారు. మోకాలి వరకు పేరుకు పోయిన బురదలో ముక్కుపచ్చలారని చిన్నారులు పడుతున్న కష్టం చూస్తే బాధేస్తోంది. వరదొచ్చి పది రోజులు దాటుతున్నా ముంపు గ్రామాల్లో ప్రతి చోటా ఇదే పరిస్థితి. ఇదేనా బాధితులను ఆదుకునే తీరు? ఆ చిన్నారిని అడిగితే మీ ప్రభుత్వానికి నిజమైన మార్కులు వేస్తుంది. ఎవరు ఏ వరదలో ఏమైపోతే మనకేంటి అనుకుంటున్నారా? పరదాలు కట్టి పలకరింపులు కాదు.. వాస్తవాలు తెలుసుకోండి..సాయం చేయండి’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
గోదావరి ముంపు ప్రాంతమైన కూనవరం మండల కేంద్రంలో ఇళ్ల పరిస్థితి ఇది. గ్రామంలో ఓ బాధితుడు తన ఇంటిని స్వయంగా కుటుంబ సభ్యులతో కలిసి శుభ్రం చేసుకుంటున్నారు. మోకాలి వరకు పేరుకు పోయిన బురదలో ముక్కుపచ్చలారని చిన్నారులు పడుతున్న కష్టం చూస్తే బాధేస్తోంది.(1/2) pic.twitter.com/wPeEau2ld3
— N Chandrababu Naidu (@ncbn) July 29, 2022
Comments 1