తన పట్ల తన పార్టీ లీడర్లు ప్రదర్శిస్తున్న లాయల్టీని జగన్ పూచిక పుల్లలా తీసి పక్కన పడేస్తున్నారు. స్వయంగా మంత్రులు తమ వినయాన్ని చాటుకోవడానికి తమను తాము కుక్కల్లా పోల్చుకుంటున్నా జగన్ మాత్రం వారిని మర్యాదను ఆత్మగౌరవాన్ని కాపాడటంలో ఏ మాత్రం చొరవచూపడం లేదు. పార్టీలో ఏం జరుగుతుందో కూడా ఆ పార్టీ నేతలకే తెలియకపోవడంతో వైసీపీ నేతల పరువు గంగలో కలిసిపోతోంది.
ఈరోజు జరిగిన రోజా ఉదంతం దీనికి తాజా ఉదాహరణ. తిరుమలకు వెళ్లిన రోజా అది ఒక పవిత్ర స్థలం అనే విషయమే మరిచిపోయి చంద్రబాబుపై విమర్శలు చేసింది. ఆమె చంద్రబాబుపై విమర్శలు చేయడం కొత్త విషయం ఏమీ కాదు. కాకపోతే ఆమె ఏ విషయం ఆధారంగా చేసుకుని బాబు పై విమర్శలు చేసిందో దానివల్లే ఈరోజు జగన్ ఆమె పరువు తీశారు.
తిరుమలలో రోజా దర్శనం చేసుకున్న అనంతరం చంద్రబాబుపై విమర్శలు చేస్తూ కరోనాతో ఎంపీ మృతిచెందితే సానుభూతి లేకుండా చంద్రబాబు అభ్యర్థిని పెట్టారని అన్నారు. అయితే, ఆమెకు అంతలోనే జగన్ షాక్ ఇచ్చారు. తిరుపతి ఎంపీ కొడుక్కి ఆ సీటు ఇవ్వకుండా హ్యాండిచ్చాడు. అయితే నిర్ణయించీ నిర్ణయించినట్టు నాన్చి నాన్చి సాయంత్రానికి అధికారికంగా బల్లిదుర్గాప్రసాద్ కుటుంబానికి హ్యాండిచ్చారు.
నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన నేతకు, పైగా అత్యధిక మెజారిటీతో గెలిచిన కుటుంబానికి జగన్ ఇంత అన్యాయం చేయడంపై పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. దీంతో చంద్రబాబుకు సానుభూతి లేదు అని రోజా విమర్శిస్తే… అసలు జగనే ఆ కుటుంబాన్ని పక్కన పెట్టడంతో రోజాకు తలతీసేసినట్టయ్యింది.
మరీ ఇంత దారుణమైన కమ్యూనికేషన్ గ్యాపా అంటూ అందరూ నోరెళ్ల బెడుతున్నారు. కొన్ని గంటల్లోనే జగనన్న రోజా పరువు తీశారు. మరి మేడమ్ కి కోపం తెప్పించిన జగన్ పై కొంపదీసి తిరుపతి ఎన్నికల్లో లోపాయకారిగా రోజా పగ తీర్చుకుంటుందేమో మరి.