ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పెట్రోలు డీజిలు చివరకు రేషన్ సరుకులపై కూడా పన్నులు వేసి ముక్కు పిండి వసూలు చేస్తున్న జగన్ పేదోడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ కి ఒక్క రూపాయి ఇవ్వడు.
వ్యాక్సిన్ కొని వేయించమంటే మరో ఏడాది ఆగు అంటాడు, డబ్బుల్లేవు అంటాడు.
హిందు ఆలయాల నుంచి హుండీ ఆదాయాలన్నీ ప్రభుత్వం తీసేసుకుని ఆ డబ్బులతో పాస్టర్లకు, మౌజంలకు గవర్నమెంటు తరఫున అధికారికంగా పంచుతున్నారు. అర్చకులకు కూడా ఇస్తున్నారు. కానీ ఆలయాల నుంచి తీసుకుంటున్నారు కాబట్టి అర్చుకులకు ఇస్తున్నారు,
గవర్నమెంటు కంట్రోల్ లేని చర్చిలు, మసీదులకు ఎందుకు ఇస్తున్నారని రఘురామరాజు ప్రశ్నించారు. తీవ్ర స్వరంతో రాష్ట్రంలో హిందులపై జరుగుతున్న దోపిడీని ప్రశ్నించారు.