ఏపీ సీఎం జగన్ తన కుటుంబంతో వ్యవహరిస్తున్న తీరు.. చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఇది వ్యక్తిగతమని ఎవరైనా అంటే.. అది పొరపాటే అవుతుందని అంటున్నారు సీనియర్లు. ఎందుకంటే. జగన్ రాజకీయాలను ఆయన కుటుంబాన్ని వేరు చేసి చూడలేమని చెబుతున్నారు. నిజానికి ఈ రోజు సీఎంగా జగన్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడం వెనుక.. ఆయన మాతృమూర్తి విజయమ్మ.. సోదరి షర్మిల కీలక పాత్రలు పోషించారు. 55 ఏళ్ల వయసులో విజయమ్మ.. ఊరూ వాడా తిరిగారు.
ఒక సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు.. చేతిలో బైబిల్ పెట్టుకుని మరీ విజయమ్మ తన కుమారుడి కోసం .. అనేక మాటలు కూడా పడ్డారు. ఇక, షర్మిల అయితే.. అహోరాత్రులు.. అన్నగారి కోసం.. పాదయాత్ర చేశారు. నేను జగనన్న వదిలిన బాణాన్ని అని.. ఆత్మ నిర్భరతను చాటుకున్నారు. ప్రజలను కలుపుకొని పోయారు. నిజానికి.. అటు విజయమ్మకు కానీ, ఇటు షర్మిలకు.. కానీ.. రోడ్లు పట్టుకుని తిరగాల్సిన అవస రం లేదు. ఎందుకంటే.. ఇంటిపట్టున ఉంటే… విజయమ్మకు వచ్చే పింఛన్లు.. ఇతరత్రా ఆదాయాలు.. నెలకు 10 లక్షలని అంటారు.
ఇక, షర్మిల విషయాన్ని తీసుకున్నా.. ఇంతకన్నా ఎక్కువ ఆదాయంతోనే జీవితాన్ని గడుపుతున్న పరిస్థితి ఉంది అయినప్పటికీ.. వారు అన్నగారి కోసం.. వైఎస్ కీర్తిని నిలబెట్టేందుకు రోడ్డు పట్టారు. నిద్రాహారాలు మానుకుని.. ప్రజాయాత్రలు చేశారు.. అయితే.. ఇప్పుడు వారికి మిగిలింది ఏంటి? అనేది ప్రధాన ప్రశ్న, అధికారంలోకి వచ్చి.. మూడేళ్లు అయింది. అయితే.. చెల్లెలి మాట ఎలా.. ఉన్నప్పటికీ.. వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మకు కుమారుడిగా కూడా జగన్ కనీస గౌరవం ఇవ్వడం లేదని పార్టీ సీనియర్లుగుసగుసలాడుతున్నారు
దీంతో తమ పరిస్థితి కూడా ఇంతేనా? అనేది వారి ఆవేదన. ఈ నెల 19న వైఎస్ విజయమ్మ పుట్టిన రోజు. అయితే… ఏపీ సీఎంగానే కాకుండా.. ఆమె ముద్దుల తనయుడిగా జగన్ ఎక్కడా ఈ కర్యక్రమాన్ని నిర్వహించకపోవడమే ఈ చర్చకంతటికి కారణం. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న విజయమ్మ.. ఖమ్మంలో ఉన్న తన కుమార్తె షర్మిల దగ్గరకు వెళ్లి… ఆమె సమక్షంలోనే పుట్టిన రోజు వేడుకను నిర్వహించుకున్నా రు.
అయితే.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. వరుసగా రెండు సంవత్సరాలు.. విజయమ్మ పుట్టిన రోజును సీఎం జగన్ ఘనంగా నిర్వహించారు. అంతేకాదు.. జిల్లాలు. మండలాలు.. గ్రామస్థాయిలోనూ విజయమ్మ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాలంటూ.. పిలుపు కూడా ఇచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 19న గత రెండేళ్ల పాటు వైసీపీలో పెద్ద ఎత్తున సంబరాలు సాగాయి. విజయమ్మ.. తాడేపల్లికి వచ్చి.. పుట్టిన రోజు కేక్ కట్ చేసి తిరిగి కడప వెళ్లేవారు. అక్కడ వైఎస్ సమాధి వద్ద.. శ్రద్ధాంజలి ఘటించేవారు.
అయితే.. ఈ సారి.. సీఎం జగన్ అసలు విజయమ్మ పుట్టిన రోజును నిర్వహించలేదు. పార్టీ నేతలకు కూడా పిలుపునివ్వలేదు. దీంతో ఈ విషయం.. తాజాగా వైసీపీలో చర్చనీయాంశం అయింది. 2014, 2019 ఎన్నికల్లో జగన్ను సీఎంను చేసేందుకు విజయమ్మ ఎంతో కష్టపడ్డారని నాయకులు చర్చించుకుంటు న్నారు.
జగన్ సీబీఐ కేసుల్లోఇరుక్కున్నప్పుడు కూడా పార్టీని బలోపేతం చేసేందుకు ఆమె కృషి చేశారు. అంతేకాదు.. వైసీపీ ఇప్పుడు ఇలా నిలబడి అధికారంలోకి రావడం వెనుక.. ప్రధాన పాత్ర పోషించిన వారిలో విజయమ్మను పక్కన పెట్టి చూడలేమని కూడా కొందరు సీనియర్లు గుసగుసలాడుతున్నారు. రేపు తమ పరిస్థితి కూడా ఇంతేనేమో.. అని అనుకుంటున్నారు.