ఏపీలో నిర్మిస్తున్న ఏకైక పూర్తిస్థాయి బహుళార్థ సాథక ప్రాజెక్టు పోలవరం. ఇప్పటికే నాగార్జున సాగర్ ఉంద ని అనుకున్నా.. దీనిలో తెలంగాణకు వాటా ఉంది. కానీ, పోలవరం విషయానికి వస్తే.. మాత్రం ఇది పూర్తిగా ఏపీకే పరిమితం. అయితే, ఇప్పుడు ఈ ప్రాజెక్టు విషయంలో అనేక మెలికలు కనిపిస్తున్నాయి. కేంద్రం నిధులు సరిగా ఇవ్వకపోవడం, ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఇప్పటికీ.. పూర్తికాకపోవడం.. ఎప్పటిక ప్పుడు గడవులు పెంచుకుంటూ పోవడం. చివరాఖరుకు రాజకీయ ప్రాజెక్టుగా మారిపోవడం వంటి కారణా లతో పోలవరం ఎప్పటికి పూర్తి అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది.
జగన్ చేసుకున్న పాపం ఏంటంటే.. గతంలో ఏ అంచనాలనైతే.. తాను వ్యతిరేకించాడో.. ఇప్పుడు అవే అంచనాల విషయంలో పాకులాడడం. నాడు.. చంద్రబాబు సర్కారు రూ.55 వేల కోట్ల పైచిలుకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో కలిపి ఇవ్వాలని కేంద్రానికిలేఖ రాస్తే.. ఇది అక్రమం.. కేవలం కమీషన్ల కోసం ఇంత పెంచారంటూ.. జగన్ అండ్ కో.. కేంద్రానికి లేఖలు రాసింది.
దీంతో అప్పటి నుంచి నీలి నీడలు ముసు రుకున్నాయి. ఇక, ఇప్పుడు ప్రబుత్వం మారినా.. కేంద్రంలో ఉన్న ప్రభువులు మాత్రం మారలేదు. ఈ విషయంలో వారు మరింత గట్టిగా పట్టుబట్టారు.
దీంతో పోలవరానికి ఇకపై 23 వేల కోట్ల అంచనాకే పరిమితం చేయనున్నారు. ఈ పరిస్థితిలో ఇప్పుడు పోలవరానికి కేంద్రం నుంచి వచ్చే నిధులు 4 వేల కోట్లు. ఇప్పటికే ఏపీ ఖర్చు చేయగా రావాల్సిన నిధులు కేవలం రెండున్న చిల్లర వేల కోట్ల రూపాయలు. ఈ పరిస్థితిలో పోలవరాన్ని నిర్మించే సాహసం.. ధైర్యం రాష్ట్రం చేసే పరిస్థితి కనిపించడం లేదు. దాదాపు ఇప్పుడున్న లెక్కల ప్రకారం.. తక్షణం 30 వేల కోట్లు కావాలి. ఇంత సొమ్ము కేటాయించే అవకాశం ఏపీకి లేదు. ఈ నేపథ్యంలోఈ ప్రాజెక్టును కేంద్రానికే అప్పగించేద్దామనేది రాష్ట్ర సర్కారు యోచనగా ఉన్నట్టు తెలుస్తోంది.
దీనికి ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు మరింతగా బలం చేకూర్చుతున్నాయి. అయితే, ఇదే జరిగితే.. దివంగత వైఎస్ ఆత్మ క్షోభించడం ఖాయమని అంటున్నారు. ఆయన ఈ ప్రాజెక్టుపై ప్రాణాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఆలస్యమైంది. ఇక, దీనిని కేంద్రానికి అప్పగిస్తే.. పులుసులో పడినట్టే.. ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. సో.. ఈ ప్రాజెక్టు సాకారం.. జగన్ సర్కారు హయాంలో అయ్యే అవకాశం ఉండనే ఉండదు. దీంతో వైఎస్ ఆత్మ క్షోభించడం ఖాయమని, నా కుమారుడు కూడా దీనిని పూర్తి చేయలేకపోయాడే! అని కన్నీరు కార్చడం ఖాయమని అంటున్నారు. కొంత అతిశయోక్తి అనిపించినా.. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఇది నిజమేనని అనిపిస్తోంది. మరి ఈ విషయంలో జగన్ తన తండ్రి ఆత్మ క్షోభించేలా చేస్తారో.. లేదా.. కేంద్రంపై పోరాడతారో చూడాలి.