జగన్ సర్కారు నిర్లక్ష్యం రైతులను ఎంత ఘోరంగా అన్యాయం చేసిందీ అసెంబ్లీ సాక్షిగా బయట్టబయలు అయ్యింది. వైసీపీ ప్రభుత్వం ఎంత అడ్డంగా ఇరుక్కుంది అంటే డబ్బుల్లేక రైతుల పంట నష్టం బీమా ప్రీమియం కట్టలేదు. ఈ విషయం అసెంబ్లీలో చర్చకు వస్తే మేము కట్టేశాం అని అసెంబ్లీ సాక్షిగా అబద్ధం ఆడింది. తర్వాత మీరు కట్టలేదు ఇదిగో సాక్ష్యం అని టీడీపీ సమాచార హక్కు చట్టం కింద సేకరించిన సమాచారం చూపిస్తే టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.
కట్ చేస్తే అడ్డంగా దొరికిపోయాం అని అర్థమైంది జగన్ ప్రభుత్వానికి. దీంతో ఆరోజు రాత్రి బీమా సొమ్ము విడుదల చేశారు. ఇది ప్రయోజనం లేని పని. ఎందుకంటే నష్టం వచ్చాక బీమా కడితే బీమా సంస్థలు నష్ట పరిహారం ఇవ్వవు. ఈ విషయంపై నిలదీస్తే జగన్ రెడ్డి, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సమాధానం తెలియక బూతులు మాట్లాడుతున్నారు. చివరకు చేసిన తప్పు అర్థమై ప్రభుత్వం డబ్బుల నుంచి రైతులకు నష్టపరిహారం చెల్లిస్తాం అన్నారు.
అంటే జగన్ రెడ్డి సర్కారు చేసిన నిర్లక్ష్యం వల్ల తక్కువ డబ్బులతో పోయే దానికి ప్రజల పన్నులతో వచ్చిన ఆదాయం అంతా వృథా అయిపోయే పరిస్థితి వచ్చింది. దీనిపై చివరకు వైసీపీ మద్దతు దారు అని జనం చెప్పుకునే జర్నలిస్ట్ అయిన సాయి కూడా కవర్ చేయలేక జగన్ ప్రభుత్వాన్ని ఎలా విమర్శించాడో కింద వీడియో చూడండి.
ఇక అసలు ప్రభుత్వం చేసిన పొరపాటు ఏంటి? తప్పు ఎలా జరిగింది. ఈ పాపం ఎవరిది. ఎవరికి నస్టం అనే సంగతులు కింది వీడియోలో చూడొచ్చు.