ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు కేసు పెద్ద సంచలనం అవుతున్న విషయం తెలిసిందే. ఆయన బెయిల్ రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ పై సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. జగన్ తరపు న్యాయవాదులు 98 పేజీలతో కూడిన కౌంటర్ దాఖలు చేశారు. మూడు వాయిదాలను అడిగి కారణం దొరక్క చివరకు ఒక బేస్ లెస్ ఆరోపణతో కౌంటర్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది.
ఈరోజు కౌంటర్ దాఖలు దాఖలు చేయాలని, లేకపోతే నేరుగా విచారణ చేస్తామని సీబీఐ కోర్టు వార్నింగ్ ఇవ్వడంతో తప్పక కౌంటర్ దాఖలు చేసినట్లు అర్థమవుతోంది.
జగన్ న్యాయవాదులు లేవనెత్తిన విషయాలు రెండు.
1. సీబీఐ కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తుందని, ఇలాంటి కేసుల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోకూడని, ఈ విషయంపై గతంలో సుప్రీంకోర్టు తీర్పులను వెలువరించిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు.
2. రఘురాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాాల కోసం, రాజకీయ కక్షతో ఈ పిటిషను వేశారని చెప్పారు.
ఇరువైపుల వాదనలు విన్న అనంతరం కేసు విచారణను కోర్టు 14వ తేదీకి వాయిదా వేసింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే… రఘురామరాజు ఉద్దేశం ఎలాగున్నా అతను చెప్పిన పాయింట్లలో ఏం తప్పులేదు. బెయిల్ నిబంధనలు జగన్ ఉల్లంఘించారని, సాక్షులను ప్రభావితం చేస్తున్నారని చెప్పారు. రఘురామరాజుకు ఎలాంటి ఉద్దేశాలున్నా జగన్ చేస్తున్నది అయితే నిజమే కదా అన్న కోణంలో కోర్టు దీనిని ముందుకు తీసుకెళ్తుందని అంటున్నారు విశ్లేషకులు.
దీని పూర్తి వివరాలు కింద వీడియోలో చూడొచ్చు.
https://www.youtube.com/watch?v=mUugwfNL04M