ఓవైపు సంక్షేమ పథకాల అమలు.. మరోవైపు కరోనా సంక్షోభం. రెండింటికి లింకుగా ఆర్థిక అంశాలు. మొత్తంగా ఏపీ అధికారపక్షం తీవ్రమైన ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ప్రతికూల పరిస్థితులు తెగ ఇబ్బంది పెట్టేస్తున్న వేళ.. వాటికి ఎదురొడ్డి వేస్తున్న సీఎం జగన్ అడుగుల్ని కొందరు విమర్శిస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఉదంతమే ఒకటి తీవ్ర రూపం దాలుస్తోంది.
కాపు నేస్తం కింద ఇచ్చే సాయం కోసం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 90,679 మంది కాపు మహిళలు ఎదురుచూస్తున్నారు.
ఈ పథకంలో భాగంగా 45 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉండే కాపు మహిళలకు ఏటా రూ.15వేల మొత్తాన్నిఇవ్వాలన్నదే లక్ష్యం. ఈ పథకాన్ని కొత్తగా ప్రవేశ పెట్టిన జగన్ సర్కారు.. లబ్థిదారులకు జూన్ 24న మొదటి విడతగా వారి ఖాతాల్లో నగదును జమ చేశారు. జులై 24న రెండో విడత నగదు వేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికి మరో రెండు నెలలు అదనంగా గడిచిపోయాయి. సీఎం జగన్ రెడ్డి మాట తప్పారు.
రెడ్డిలకు పదవులు ఇచ్చేటపుడు కచ్చితంగా సమయం పాటించే జగన్ కాపుల విషయానికి వచ్చేసరికి… నిర్లక్ష్యమే నిర్లక్ష్యం. జులైలో ఇస్తామన్న డబ్బులు సెప్టెంబరుకు కూడా రాలేదు. ఇప్పటివరకు ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 1.02లక్షల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 11,547 మందిని అనర్హులుగా పేర్కొంటూ వారి అప్లికేషన్లను రిజెక్టు చేశారు.
మిగిలిన 90,679 మందిని అర్హులుగా పేర్కొంటూ వారిని లబ్థిదారుల జాబితాలో చేర్చారు. ఆగస్టు మూడో వారంలో కాపునేస్తం నగదును ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేస్తామని చెప్పారు. అయితే.. ఇప్పటివరకు ఎలాంటి నగదు సాయం అందలేదు.
నెలలో ఇస్తానన్న డబ్బులు మూడు నెలలు దాటిన తర్వాత కూడా లబ్థిదారులకు నగదు సాయం అందకపోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. సంక్షేమ పథకాలతో ప్రయోజనం ఎంత ఉంటుందో.. దాన్ని సరిగా అమలు చేయకపోతే.. ఇబ్బందులు అంతేలా ఉంటాయి. చంద్రబాబు అనేక పథకాలు పెట్టినా ఏవీ టైం తప్పలేదు. ముద్రగడ ను మేనేజ్ చేసిన జగన్ కాపులను చంద్రబాబుకు శత్రువులను చేశారు. ఇపుడేమో వారికి జగన్ తమను దేకడం లేదని ఫీలవుతున్నారు. నేను మీకు అన్న ముద్రగడ…. నాకేం సంబంధం లేదు కాపుల ఉద్యమంతో అంటున్నారు.
చెప్పాడంటే చేస్తాడంటే అని డప్పులు కొట్టుకోవడమే గాని జగన్ మాటతప్పిన జాబితా రాయాలంటే ఒక పుస్తకమే తయారవుతుంది. దానికి పునాది ఉద్యోగుల సీపీఎస్ రద్దు హామీతోనే పడింది. వారంలో రద్దు చేస్తాను అన్న జగన్ ఇపుడు 80 వారాలయినా పట్టించుకోవడం లేదు.