జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. శాసనసభ వ్యవహారాల సలహా మండలి సమావేశంలో రాజీనామా అంశం ప్రస్తావనకు వచ్చింది. సోమవారం ఉదయం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం మొదలు కాగానే టీడీపీ ఎంఎల్ఏలు చేయడం మొదలుపెట్టారు. గవర్నర్ మాట్లాడుతున్నంత సేపు టీడీపీ ఎంఎల్ఏలు ఆందోళన చేస్తూనే ఉన్నారు.
గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయటమే కాకుండా బడ్జెట్ కాపీలను చించి గవర్నర్ పైకి విసిరేశారు. పోడియం దగ్గరకు వెళ్ళి కాపీలను చించి అధికారులపైకి కూడా విసిరారు. దీంతో జగన్ కు బాగా కోపం వచ్చింది. దాంతో పోడియం దగ్గరకు మార్షల్స్ చేరుకుని ఎంఎల్ఏలను వెనక్కు పంపించేశారు. దాంతో ఎంఎల్ఏలు ఏకంగా అసెంబ్లీనే బహిష్కరించి బయటకు వెళ్ళిపోయారు.
ఇదే విషయమై తర్వాత జరిగిన బీఏసీ సమావేశంలో జగన్ ప్రస్తావించారు. సమావేశంలో పాల్గొన్న టీడీపీ ఎంఎల్ఏ అచ్చెన్నాయుడు సమాధానమిస్తూ గతంలో మీరు కూడా ఇలాగే చేశారని చెప్పారు. దానికి జగన్ స్పందిస్తూ ‘తాను గతంలో ఇలాగే చేసినట్లు నిరూపిస్తే ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తాను, మంత్రిమండలిని కూడా రద్దు చేసుకుంటా’ అని చాలెంజ్ చేశారు. దానికి అచ్చెన్న వెంటనే సర్దుకుని గవర్నర్ ప్రసంగానికి నిరసన తెలపటం అన్నది ఇదే మొదటిసారి కాదు కదా అన్నారు.
దానికి జగన్ స్పందిస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుని తాము ఎప్పుడూ ఆందోళన చేయలేదన్నారు. ఒకవేళ తాము గోల చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని మరోసారి జగన్ సవాలు విసిరారు.
సీఎం మాట్లాడేటపుడు, మంత్రలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటపుడు ప్రతిపక్ష ఎంఎల్ఏలు అడ్డుపడటం, గోల చేయటం ఎప్పుడూ ఉండేదే. కానీ గవర్నర్ ప్రసంగించేటపుడు అప్పట్లో వైసీపీ కూడా చేసింది. పెద్దరికానికి గౌరవం ఇవ్వాలని చెప్పే జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలు సీనియర్ అయిన చంద్రబాబుకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారో గమనిస్తే బాగుంటుంది.