కేంద్రం అఫిడవిట్ ఇచ్చి 55 వేల కోట్ల రివైజ్ అంచనాలకు ఒప్పుకుని… స్వయంగా కేంద్రం కోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. ఆధారాలు ఇప్పటికి ఉన్నాయి. అప్పటి కేంద్ర మంత్రులు స్వయంగా కొత్త అంచనాలను ఆమోదించిన విషయాన్ని చెప్పారు. సాయిరెడ్డి రాజ్యసభలో అడిగినపుడు కూడా 55 వేల కోట్ల అంచనాలకు ఓకే చేశాం అనే చెప్పారు.
ఇపుడు తన మాట గీత దాటకుండా వినే జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటంతో బీజేపీ ఆడిందే ఆట అవుతోంది. కరోనాతో ఆదాయం పడిపోవడంతో తాజాగా పోలవరానికి గండిపెట్టింది. ఇదిగో పోలవరం గురించి పచ్చి నిజాలు ఇక్కడ ఆధారాలతో చూడొచ్చు.
ఇదంతా చూశారుగా…
ఇపుడు విశాఖలో మెట్రో కడతారట. దానికి కేంద్రం నిధులు ఇస్తామని ఇంకా ప్రకటించనే లేదు. దానికి నిధులు కేంద్రం నుంచి పట్టుకువచ్చి కడతారట. ప్రజలకు మెట్రోను అందిస్తారట.
ఇప్పటికే రాజ్యసభలో అధికారికంగా ప్రభుత్వం పత్రం ఇచ్చిన నిధులను ఇవ్వము ఏం చేస్కుంటారో చేస్కోండి అని కేంద్రం చెబితే ఏమీ చేయలేని జగన్ సర్కారు ఇపుడు ఏకంగా మెట్రోకి డబ్బులు పట్టుకువస్తాం అని చెబుతుంటే విశాఖ ప్రజలు నవ్వుతున్నారు. గోదావరి జిల్లాలకు పోలవరం ఆపేసి శఠగోపం పెట్టారు. ఇపుడు మాకు శఠగోపం పెట్టేందుకు వచ్చారా? అని సెటైర్లు వేస్తున్నారు.
ఇదీ వైసీపీ మాట గారడీ అని తెలుగుదేశం నేతలు, నెటిజన్లు ఉతికారేస్తున్నారు.