వైసీపీ అబద్ధాలు చెబుతుంది అని ఎవరూ ప్రత్యేకంగా నిరూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంట చంద్రబాబు ‘‘ఉచిత ఇసుక’’ స్కాం జరుగుతుందని నమ్మించిన వైసీపీ పార్టీ నేడు అప్పటి కంటే ఒక్కరూపాయి తక్కువకు కూడా ఇసుక ఇవ్వలేకపోతోంది.
నానా ఆపసోపాలు పడి 16 నెలలు ఆ ఇసుకను ఎలా అందించాలో తెలియక తంటాలు పడి… కూలీలను రోడ్డు కీడ్చి, ప్రాణాలు తీసి, ఇసుక కొనేవారికి చుక్కులు చూపించి సిమెంటు రేటుతో సమానంగా ఇసుక పెరిగి మళ్లీ నానా పాలసీలు మార్చినా దానిని చంద్రబాబు కంటే తక్కువ ధరకు ఇవ్వలేకపోతున్నారు జగన్ రెడ్డి.
తెలుగుదేశం ప్రభుత్వం ఇసుక నది ఇచ్చే నిధి కాబట్టి. అందరికీ ఉచితం అనేశారు. అయిపోయింది. ఇసుకను వేసుకొచ్చి మనింటి ముందు వేసిన లారీకి డబ్బులు కడితే సరిపోయేది. కానీ ఇపుడు ఇసుక కొనడం కన్నా స్కూలు సీటు కొనడమే ఈజీ అన్నట్టుంది ఏపీ పరిస్థితి. జగన్ ఇసుక మాయపై అడ్డంగా ఏకిపారేసిన రఘురామ వీడియోను కింద చూడొచ్చు.