ఇటీవల బడ్జెట్ సమావేశాల రోజు ఒక ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. అదిపుడు మీకిపుడు చెబుతాను.
మేము అసెంబ్లీ కవరేజీ కోసం అసెంబ్లీ కి వెళ్లాం. మధ్యాహ్నం లంచ్ టైంలో ఒక సీనియర్ వైసీపీ నాయకుడు ఒకరు నేను, నా తోటి కొలీగ్ మాట్లాడుకుంటుండగా వచ్చి పలకరించారు.
ఆ సందర్భంగా మేము ఆయనకు ఒక ప్రశ్న వేశాం. ఆయన ఆన్సర్ విని మాకు షాక్ తిన్నంత పనయ్యింది.
ఇంతకీ ఆయనకు మేము ఏం ప్రశ్న వేశామో తెలుసా? ఏమండీ మీ వైసీపీ గవర్నమెంటు వచ్చి రెండేళ్లవుతుంది గా…. డెవలప్మెంట్ పై మీ మాటేమిటి? అని అడిగాం. ఆయన ఏమన్నాడంటే…. ‘మా మాటేం లేదు. మా అన్న మాటే మా మాట‘ అన్నాడు.
సరేనండీ మీ జగనన్న మాటే చెప్పండి. 2 సంవత్సరాలు అయ్యాక ఒక అంచనాలు, లెక్కలు ఉంటాయిగా మరి అభివృద్ధి గురించి జగన్ మాటేటిమి అని అడిగాం. ఆయన ఇచ్చిన ఆన్సర్ మమ్మల్ని షాక్ కి గురిచేసింది. ఏంటి జగన్ కి ఏపీ గురించి ఇంత క్లారిటీ ఉందా అనిపించింది. ఇంతకీ జగన్ ఆన్సర్ ఏంటో ఆయన మాటల్లో తెలుసుకుందాం.
‘‘మా జగన్ గారి ది ఒకటే లాజిక్. రాష్ట్రం దాని అభివృద్ధి ఆలోచించిన చంద్రబాబును జనం కసిగా ఓడించారు. పోలవరం కడతాను, అమరావతి కడతాను అన్నాడు, పరిశ్రమలు తెచ్చాడు. అయినా కసితీరా ఓడించారు. ఎందుకు ఓడించారు? వారికి కావల్సినది ఇంకేదో ఉంది. అది చంద్రబాబు ఇవ్వలేదు. రాష్ట్రం సంగతి మాకెందుకు మాకేంటి అని జనం అనుకున్నారు. మార్పు కోసం చూశారు. నా నుంచి వారు స్వప్రయోజనాలు ఆశిస్తున్నారు. వారికి మిగతా వాటితో సంబంధం లేదు. అలాంటపుడు వారు ఆశించినది చేయకుండా నేను చంద్రబాబు లాగా అభివృద్ధి గురించి ఆలోచిస్తే నా హస్తమే నాకు భస్మాసుర హస్తం అవుతుంది. రాష్ట్రం ఏమవుతుందో తెలియదు. నేను మాత్రం మళ్లీ గెలవడం కష్టమవుతుంది. అందుకే… రాష్ట్రానికి అవసరమైనది కాకుండా, జనానికి అవసరమైనదే చేస్తాను, ఎవరేం మొత్తుకున్నా జనం దేనికి ఓట్లేస్తారో అది మాత్రమే చేస్తాను. అభివృద్ధి చేయలేదు కాబట్టి జగన్ ని జనం ఓడిస్తారు అని చంద్రబాబు అనుకుంటూ ఉంటారు. ఆయనను ఆ భ్రమలోనే ఉంచుదాం. జనానికి నచ్చేది మనం చేసుకుంటూ పోదాం. వాళ్లని శాటిస్ఫై చేద్దాం. మీరు మీడియాకో, ఇంకొకరికో భయపడి అభివృద్ధి గురించి తడబడకండి. జనానికి -మనకు ఉండాల్సిన కనెక్షన్ ఉంది. చంద్రబాబు ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచన విధానంలో ఉన్నాడు. జనం ఆలోచన ఇంకోరకంగా ఉంది మన గెలుపు గురించి బెంగలేదు. చంద్రబాబు మాటలు జనానికి పట్టడం లేదు. మనం ఆ తప్పు చేయొద్దు‘‘
ఇది వైసీపీ నేతల అంతర్గత మీటింగ్స్ లో జగన్ చెప్పిన మాట. ఏ నేత వచ్చే ఎన్నికల గురించి ఆందోళన చెందినా జగన్ ఇదే చెబుతాడట. అయినా జగన్ క్లారిటీ చూసి మీరు కూడా షాక్ తిన్నారు కదా. వామ్మో వైసీపీ !!