ప్రజలపై ప్రతి వారానికో కొత్త భారం వేయడంలో ఏపీ ప్రభుత్వం బిజీగా ఉంది. ప్రతి వారం ప్రజలకు కష్టమో, నష్టమో కలిగించే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటు జగన్ సర్కారు జనాన్ని ఏడిపిస్తోంది. మొన్న జగన్ వేసిన టోల్ చార్జీలపై అల్లాడిపోయిన జనం… సర్కారు తాజా నిర్ణయం చూసి అవాక్కయ్యారు.
అవసరం లేని పథకాలు పెట్టి ఒకవైపు డబ్బువృథా చేసే ప్రభుత్వం… ప్రజలకు అవసరమైన రోడ్లు వంటి విషయాలకు మాత్రం డబ్బుల్లేవంటోంది. ఇపుడు ఏకంగా … ఆపదలో ఆదుకునే ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ కోత పెట్టారు. ఇక పై ఆరోగ్య శ్రీ లో కవర్ అయ్యే రోగాల కోసం ఎవరైనా ముఖ్యమంత్రి సహాయ నిధికిఅర్జీ పెట్టుకునే అవకాశమే లేకుండా చేశారు. సింపుల్ గా చెప్పాలంటే… 95 శాతం వ్యాధుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకునే అవకాశం రద్దు చేశారు.
సర్కారు తాజా ఆదేశాలు మింగుడుపడనివిగా మారాయి. ఆరోగ్య శ్రీ పరిధిలో లేని ఒకట్రెండు సర్జరీలకు తప్పించి.. మిగిలిన వాటికి అవకాశంగా లేదంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఎవరైనా మీ వద్దకు వస్తే సిఫారసు చేయొద్దు అంటూ ఏపీలోని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ప్రభుత్వం సూచించండం గమనార్హం. పేదలు, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి వారికి అండగా ఉండే ముఖ్యమంత్రి సహాయ నిధికి కత్తెర వేయడంపై రాజకీయ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తంచేస్తున్నాయి. అసలు జగన్ ఇన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని సొంత పార్టీ నేతలే వాపోతున్నారు. ప్రజలకు లెటరే ఇవ్వకూడదంటే ఇక మమ్మల్ని ప్రజలు బూతులు తిడతారు అంటున్నారు.