???????????? That is #LokeshNara ???????????? pic.twitter.com/SpxVgjiPfK
— Swathi Reddy (@Swathireddytdp) February 2, 2023
మోసం అనే పదానికి ఫ్యాంటు చొక్కా తొడిగితే.. జగన్ అవుతాడని.. టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణని రాష్ట్రానికి పరిచయం చేసింది చంద్రబాబేనని చెప్పారు. రాయలసీమకి కియా, ఫాక్స్ కాన్, సెల్ కాన్, డిక్సన్, అపోలో టైర్స్ వంటి ప్రఖ్యాత కంపెనీలు తెప్పించారని చెప్పారు.
రాయల సీమలోని 2 లక్షల మంది యువతకి ఉద్యోగాలు కల్పించింది టీడీపీ హయాంలోనేనని చెప్పారు. రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తున్న సమయంలో ఒక్క చాన్స్ ఇవ్వండని వేడుకుని అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్ అని లోకేష్ నిప్పులు చెరిగారు. మోసానికి మానవరూపం జగన్ రెడ్డి అని, అందుకే జగన్ మోసపు రెడ్డి అని పేరు పెట్టామని లోకేష్ ఎద్దేవా చేశారు.
జాబ్ క్యాలెండర్ ఇస్తామని యవతని ఛీట్ చేశాడని జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రత్యేక హోదాని కేసుల కోసం తాకట్టు పెట్టారని అన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ పేరుతో మోసగించాడని వ్యాఖ్యానించారు. 45 ఏళ్ల దాటిన మైనారిటీ ఎస్సీ,ఎస్టీ, బీసీల మహిళలకు పెన్షన్ ఇస్తానని మోసం చేశాడన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ అమ్మ ఒడి ఇస్తానని ఛీట్ చేశాడన్నారు. సంపూర్ణ మద్యనిషేధం చేసి ఓట్లు అడుగుతానని, కల్తీ మద్యం పారిస్తున్న మోసగాడు జగన్ అని లోకేష్ విరుచుకుపడ్డారు.
మద్యనిషేధం హామీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి తన బినామీలతో కల్తీ మద్యం తయారీ, ప్యాకింగ్, రవాణా, సేల్స్ చేయిస్తూ మహిళల తాళిబొట్లు తెంచేస్తున్నాడని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఇంకెక్కడి మద్యపాన నిషేధం? అని ప్రశ్నించారు. జగన్ బ్రాండ్ మద్యం ల్యాబుకి పంపితే.. పురుగు మందు పంట పొలాల్లో పనిచేస్తుందో లేదో కానీ.. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ కొడితే పురుగులు చనిపోతాయని తేలినట్టు చెప్పుకొచ్చారు.