గుంటూరులో పేరు వివాదం మొదలైంది. వివేకా మర్డర్ కేసు వార్తలు కప్పిపుచ్చడానికి ఏపీ సర్కారు నిరంతరంగా చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొకటి. తాజాగా గుంటూరులోని ఏటీ అగ్రహారం పేరును ఫాతిమానగర్ గా మార్చిన వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది.
వందేళ్ల చరిత్ర ఉన్న ప్రాంతం పేరును ఎలా మారుస్తారని ప్రజలు నిలదీస్తున్నారు. గుంటూరుతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ ఎ.టి. అగ్రహారం సుపరిచితం. ఎ.టి. అగ్రహారం మూలాలు గుంటూరు నగరంతో దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయి. గుంటూరు పట్టణం అంత పెద్దగా లేని రోజుల్లో అగ్రహారం ఫేమస్.
గుంటూరు నగరం శరవేగంగా అభివృద్ధి చెందడంతో ఏటీ అగ్రహారం గుంటూరులో కలిసిపోయింది. ఈ ప్రాంతంలో 95 శాతం హిందువులు మరియు 5 శాతం ఇతర మతస్థులు ఉంటారు. మెజారిటీ ప్రజలు తమది ఎ.టి. అగ్రహారం అని చెప్పుకోవడానికి గర్వపడతారు.
జనాలను రెచ్చగొట్టే విధంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అగ్రహారం పేరును తీసి ఇతర మత పేరును పెట్టడం కలకలం రేపుతోంది.
దీంతో ఈ ప్రాంత వాసులు మున్సిపల్ కార్పొరేషన్ మరియు అధికార పార్టీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎ.టి. అగ్రహారం పేరు మార్పుపై నిలదీస్తున్నారు. ఏటీ అగ్రహారంగా పేరున్న ప్రాంతం పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం వివేకా మర్డర్ కేసు ద్రుష్టి మరల్చడానికే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దేశమంతటా ఇలాంటి విషయాలపై గట్టిగా పోరాడే బీజేపీ ఏపీ విషయానికి వచ్చే సరికి జగన్ సర్కారు ఏం చేసినా మాకిష్టమే అన్నట్టు వ్యవహరించడం కొసమెరుపు.