అలవికాని సంక్షేమ పథకాలను అమలుచేసి డబ్బులు పంచతున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి… పంచడానికి డబ్బులు చాలక జనాలకు తెలియకుండా కొన్ని, తెలిసి కొన్ని బాదేస్తున్నాడు. తాజాగా ఉల్లి ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. బహిరంగ మార్కెట్లో ఉల్లిధర 80-90 రూపాయలు పలుకుతోంది. దీంతో దానిని కొనలేక జనం బెంబేలెత్తిపోతున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్రం ఉల్లిధరలు తగ్గించడానికి చర్యలు చేపట్టింది. ఉల్లి ఎగుమతులు నిషేధించిన కేంద్రం 25 రూపాయలకే ఉల్లిని రాష్ట్రాలకు అమ్ముతోంది. ప్రజలకు అందుబాటులో ఉంచండి అని ఆ రేటుకు అమ్ముతోంది. అయితే, కేంద్రం వద్ద 25 రూపాయలకు ఉల్లిని కొంటున్న జగన్ సర్కారు దానిని ప్రజలకు 15 రూపాయల లాభం వేసుకుని 40 రూపాయలకు అమ్ముతోంది. ఖజానాను ఖాళీ చేస్తున్న జగన్ రెడ్డిని నింపుకోవడానికి అనేక పాట్లు పడుతున్నారు. చివరకు సామాన్యులను ఉల్లిగడ్డల రూపంలో కూడా వదలడం లేదు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఇలాంటి పరిస్థితే వస్తే… అపుడు కూడా కేంద్రం 25 రూపాయలకు రాష్ట్రాలకు అమ్మింది. చంద్రబాబు సర్కారు కొంత భారం తాను భరించి కేవలం 10 రూపాయలకే ప్రజలకు ఉల్లిని అందుబాటులోకి తెచ్చింది. అపుడేమో ప్రభుత్వం భారం మోసి ప్రజలకు సాంత్వన కలిగిస్తే ఇపుడు జగన్ సర్కారు లాభాల కోసం ఉల్లితో వ్యాపారం చేస్తోంది.
దీంతో జగన్ పథకాలు వద్దు స్వామీ. రూపాయి ఇచ్చి పది రూపాయలు తెలియకుండా లాక్కుంటున్నారని అంటున్నారు. ఇక ఇప్పటికే వరకు జగన్ బాదుళ్లు మామూలుగా లేవు. బాదుడే బాదుడు!
కరెంటు ఛార్జీలు పెంచాడుబస్సు ఛార్జీలు పెంచాడుదేవస్థానాల్లో రూముల అద్దెలు పెంచాడుదేవస్థానాల్లో పార్కింగ్ ఫీజు పెంచాడుపెట్రోలు ధరలు పెంచాడు గ్యాస్ ధర పెంచాడుభూములు రేట్లు పెంచాడుచివరకు పేదలకు అందుబాటులో ఉండే రేషన్ షాపుల్లో సరుకుల ధర కూడా పెంచాడు జగన్ రెడ్డి.
ఏందయ్యా ఇది అని జనం వాపోవడం తప్ప ఏం చేయలేని పరిస్థితి.