నిన్నటి దాకా కౌలు రైతులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో ఆ డేటానే లేదు. కానీ ఇప్పుడు అస్సలు ఒక్కరు కూడా పరిహారం అందుకోని వారు లేరు అని ముఖ్యమంత్రి జగన్ చెబుతుండడం విశేషం. వినేందుకు, నమ్మేందుకు కొన్ని బాగుండాలి. ఆ విధంగా పశ్చిమ గోదావరి వాకిట ఈ రోజు జగన్ కొన్ని అబద్ధాలు చెప్పారని జనసేన అంటోంది. తాము ఆ రోజు చెప్పిన మాటలు వాస్తవ దూరం కావని, కానీ ఇవాళ రైతు భరోసా పేరిట ప్రధాని సహకారంతో చేస్తున్న పెట్టుబడి సాయం అన్నది నిజంగానే నిజంగానే కొందరికే చేరుతుందని, కావాలంటే తాము నిరూపిస్తామని అంటున్నారు.
తాము చెప్పింది అబద్ధం అయితే వలంటీర్లకు ఆ రోజు సమాచారం తేవాలని ఎవరు ఆదేశించారు. జిల్లాలలో ఇన్ఫో లేదు సరిగ్గా తీసుకురండి అని ఎవరు ఆదేశించారు అని ప్రశ్నిస్తోంది జనసేన. ముఖ్యంగా ఏడు లక్షల పరిహారం చెల్లించేందుకు ముందు అస్సలు ఒప్పుకోని వైసీపీ తరువాత కాలంలో వివరాలు సేకరించాక, కౌలు రైతుల ఆత్మహత్యలు అన్నవి నిర్థారణ అయినాక మాట మార్చడం సబబుగా లేదని అంటోంది జనసేన.
వాస్తవానికి జనసేన తరఫున మూడు జిల్లాలలో అనంతపురం, పశ్చిమ గోదావరి, కర్నూలులో పవన్ పర్యటించాక, ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున సాయం చేశాక ప్రభుత్వంలో కదలిక వచ్చిందని, ఇప్పుడు మాత్రం తమ నేతను దత్తపుత్రుడు అని వ్యవహరిస్తూ.. ఒక్కరంటే ఒక్కరు కూడా పరిహారం అందలేదని పవన్ పర్యటనలో తేలిందని చెప్పడం అస్సలు అంటే అస్సలు నిజం కాదని వాపోతోంది. ఇంతటి స్థాయిలో నిస్సిగ్గుగా అబద్ధాలు మాకు చెప్పడం చేతకావడం లేదని మండిపడుతోంది సీఎం తీరుపై !