జగన్ భజన రోజురోజుకి శృతిమించుతోంది. అసెంబ్లీ నుంచి స్కూళ్ల వరకు నిత్యం జగన్ భజనే. బతికుండగానే ఏకంగా గుడులు ఎమ్మెల్యేల చేత గుడులు కట్టించుకుంటున్నారు సీఎం జగన్. గుడి కట్టమని ఆయన అడక్కపోవచ్చు కానీ కడుతున్న వాడిని ఆపాలి కదా… అది చేయలేదు.
ఇక విద్యార్థులతో ఇలాంటి దారుణాలు చేయిస్తారా అంటే లోకేష్ ఈరోజు జగన్ పై విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వైకాపా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గా మార్చేసారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోకేష్ మాటల్లో చెప్పాలంటే…
జగన్ రెడ్డి గారూ! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వైకాపా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గా మార్చేసారా? లేకపోతే ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాలలో ఏంటీ సిగ్గుమాలిన పనులు? అమ్మఒడి ఇస్తున్నామని ప్రచారం చేసుకుని వైకాపా బడులు చేస్తున్నారా?
వైకాపా జెండా ఎత్తమంటూ ముక్కుపచ్చలారని పిల్లలతో ఆడించారు. రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న అంటూ విద్యార్థులతో పాడించారు. విద్యాశాఖా మంత్రి సాక్షిగా విద్యాలయాన్ని విషప్రచార నిలయం చేశారు.
మొన్న భామిని తహసీల్దార్ తాగి మన జగనన్న అంటూ గెంతులేశాడు. నిన్న వందలాది గిరిజన విద్యార్థులతో వైకాపా పార్టీ ప్రచారగీతాలకు స్టెప్పులేయించారు. ప్రభుత్వ కార్యక్రమాలలో తెలుగుతల్లి గీతాలాపన రద్దు చేసి వైకాపా పాటలు పెట్టేశారా?
– ఇది నారా లోకేష్ ట్వీట్ (థ్రెడ్)
ఇదే కాదు… అసలు జగన్ రెడ్డి తన పేరుపై ఎన్ని పథకాలుపెట్టారో లెక్కేలేదు. అమ్మఒడికి కూడా జగనన్న అమ్మఒడి అని పెట్టడం అన్నిటికంటే హైలెట్.
ఇవేం చూశారు
వైఎస్సార్ మాల
జగన్ గుడి
జగనన్నకి వందనాల పాట
బ్రహ్మరథం ఊరేగింపు
సైకత శిల్పం
గ్రానైట్ రాయిపై శిల్పాలు
దేవుడు రాపాకతో, ఏసు అని మరొకరితో, సాయి బాబా అని ఇంకొకరితో అసెంబ్లీలో పొగిడించుకోవడం
బీచ్ లో జగన్ ఫొటో ఊరేగింపులు
పాలాభిషేకాలు
రాముడితో రోజా పోల్చడం
గాంధీ అని సాక్షిలో రాసుకోవడం.. ఈ సాక్ష్యాలన్నీ కింద ఉన్నాయి. వీడియోలతో సహా