రఘురామరాజు వల్ల ఏపీ సీఎం జగన్ రెడ్డికి అనేక నిద్రలేని రాత్రులు. పాపం మొదట్నుంచి జగన్ ని చాలా గౌరవిస్తు కేవలం వ్యవస్థలో తప్పులు మాత్రమే వెతికిన RRR ను జగన్ అర్థం చేసుకోలేదు. పైగా తన వారితో బూతులు తిట్టించారు. చివరకు మొన్న అసెంబ్లీలో లుచ్చా అని తిట్టినందుకు తన పార్టీనేతను కూడా అభినందించారాయన.
తాను మంచి చేద్దామని ప్రయత్నిస్తే తననే వేధిస్తారా అని రఘురామరాజుకు కోపం వచ్చింది. అప్పటి సీబీఐ డైరెక్టరునే ప్రలోభ పెట్టి జగన్ తన కేసు కదలకుండా చేసుకున్నారని ఆరోపించిన రఘురామరాజు జగన్ బెయిల్ నిబంధనలు అన్ని ఉల్లంఘించారని, ఆయన బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషను వేశారు. నాలుగు వారాల క్రితం వేసిన ఈ కేసులో ఇది మూడో వాయిదా, చివరి వాయిదా.
ఇపుడు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 17వ తేదీన సీబీఐ కోర్టు జగన్ ను, సీబీఐని హెచ్చరిస్తూ ఈరోజుకి కేసు వాయిదా వేసింది. నేడు జగన్ , సీబీఐ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. కౌంటర్ పై నేడు సీబీఐ కోర్ట్ లో వాదనలు వినిపిస్తారు. ఇరు వాదనలు విన్న తరువాత కీలక ఆదేశాలను సిబిఐ కోర్ట్ జారీ చేయనుంది.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… నిన్ననే సీబీఐకి కొత్త డైరెక్టరు వచ్చారు. ఆయన వచ్చాక ఈ కేసు విచారణ మొదలుకావడంతో వైసీపీలో ఆందోళన పెరిగింది. మరి ఈ పిటిషను ఎక్కడిదాకా దారితీస్తుందో , ఎలా ఫలితాలను ఇస్తుందో తెలియని పరిస్థితి.