జూన్ 1, వైసీపీ నేతలు వణుకుతున్నారు. మంగళవారం ఏ వార్త వినాల్సి వస్తుందో అని.
అనడానికే ఇది మంగళవారం గాని మాకు అమంగళం అవుతుందేమో అని వారి బెంగ.
బెయిల్ అనే పదమే డిక్షనరీ నుంచి రద్దు చేద్దామంటే కుదరదాయె.
అసలు ప్రశాంతంగా తన మానాన తాను మైకు పెట్టుకుని వీడియోలు చేసుకుంటున్న రఘురామరాజును తట్టి లేపి మరీ అతని కెపాసిటీ ఏంటో అతనికి చూపిస్తే ఎట్లా… పాపం విషయం ఎక్కడ దాకా వచ్చిందో చూడండి. అపాయింట్ మెంట్ తో పోయేదానికి బెయిల్ దాకా వచ్చింది వ్యవహారం.
రఘురామకృష్ణరాజు తో పెట్టుకోవడం తప్పు. అపాయింట్మెంట్ ఇవ్వకుండా మానసికంగా దెబ్బతీద్దామనుకున్నారు.
అడుగడుగునా ఆయన్ని రెచ్చగొట్టారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద ప్రయోగించిన, అలవాటైన అరాచకాలను ప్రయోగించారు. ఎంపిలు స్పెషల్ విమానంలో ఢిల్లీ వెళ్ళారు. విమానం ఖర్చులు బొక్క అని రాజు గారితో అనిపించుకున్నారు. అక్కడి నుంచి రోజూ ప్రచ్ఛన్న యుద్దమే.
పాపం అప్పటికీ ఆయన బెయిల్ జోలికి పోలేదు. కానీ ఏకంగా సీబీఐ తో చెన్నైలో రాజుగారి మీద కేసులు పెట్టించారు. ఎఫ్ఐఆర్ వేయించారు. ఈగో దెబ్బతీసారు. అంతటితో వదల్లేదు. దీంతో అదిక్కడి దాకా వచ్చింది.
బెయిల్ ఎందుకు రద్దు చేయాలి అనే వాదనకు అత్యంత బలమైన ఆధారాలతో పిటిషన్ తయారు చేసారు RRR.
బెదిరిస్తే పిటిషను వెనక్కు తీసుకుంటాడేమో అని ఆశపడ్డారు. అబ్బే… పెద్దమొండి రాజు. జగ మొండి అయిపోయాడు.
జూన్ 1 సిబిఐ బెయిల్ కేసు ,
జూన్30 ఈడి మనీలాండరింగ్ కేసు విచారణ…ఒక పక్క సిబిఐ ఒక పక్క ఈడి ….— ✨tdp raghu ✨ (@raghu_lovely09) May 30, 2021