కమ్మ కులం పూజారి జగన్ !… వినడానికి ఈ స్టేట్ మెంట్ విచిత్రంగా ఉన్నా ఇది పచ్చి నిజం.
మీరు ముస్లింగా మారాలనుకుంటే… మీరు ముస్లిం మతపెద్దను ఆశ్రయిస్తే ముస్లిం మతాచారం ప్రకారం ఆ మతం పుచ్చుకునే విధానం ఒకటి చెప్తారు, మీరు ఆ మతస్థులుగా మారవచ్చు.
మీరు క్రిస్టియన్ గా మారాలి అనుకుంటే… మీరు ఏదైనా చర్చికి వెళ్లి పాస్టరును కలిస్తే మిమ్మల్ని ఆ మతంలో బైబిల్ అనుసారం ఆ మతంలో కలిపేస్తాడు…
మరి మీరు కమ్మవాళ్లు కావాలంటే ఎలా?
మీరు చౌదరి గారిగా మారాలంటే ఎలా?
మీరేమీ కంగారు పడకండి.
మీ మతం కులం ఏదైనా పర్లేదు.
జగన్ ని జగన్ సర్కారును మంచి పాయింట్లతో విమర్శిస్తే… వారే మిమ్మల్ని కమ్మ కులస్థులుగా మార్చి కమ్మవారిగా, చౌదరిగా చేసేస్తారు. పైగా మిమ్మల్ని కమ్మ వారిగా మార్చారు అనడానికి చక్కటి ఆధారం కూడా ఉండేలా తన సొంత పత్రికలో మీరు కమ్మ వారు అని అచ్చేస్తారు. అంతే ఇక వెంటనే మీరు కమ్మవారిగా మారిపోతారు.
నిత్యం కమ్మ కులాన్ని జపిస్తూ కమ్మ మంత్రాలు చదువుతూ … అడిగిన వారికి, అడగని వారికి కమ్మ కులం పుచ్చుకునే తంతును పూర్తి చేస్తున్నారు కాబట్టి జగన్ ను కమ్మ కులానికి పూజారి అనడం వంద శాతం కరెక్టు.
తాజాగా జగన్ మరియు ఆయన మీడియా ఒక కారు డెకార్ కంపెనీ ఓనరును, లిటిల్ విలేజ్ అనే విజయవాడ హైవేలోని ఒక రెస్టారెంటు ఓనరును జగన్ కమ్మవారిగా మార్చేశారు.
ఇటీవలే పీవీ రమేష్ ను కూడా పీవీ రమేష్ చౌదరిగా మార్చేశాడు.
ఈరోజు అయితే… ఏకంగా కార్ల ర్యాలీలో పాల్గొన్న వేల మందిని కమ్మ కులంలో జాయిన్ చేశాడు జగన్.
మొత్తానికి జగన్ పుణ్యమా అని కమ్మకులస్థుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది.