• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ గాలి తీసిన ఐవైఆర్…షాకింగ్ కామెంట్లు

ఏపీకి సరైనోడు, సామర్థ్యం ఉన్న నాయకుడు లేడంటూ ఐవైఆర్ సంచలన వ్యాఖ్యలు

admin by admin
October 19, 2021
in Andhra, Politics, Trending
0
0
SHARES
549
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో సీఎం జగన్ చేస్తున్న అప్పులు…వాటికోసం ఏపీ ఆర్థిక శాఖ పడుతున్న తిప్పలు గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఏపీ ఆర్థిక ఊబిలో కూరుకుపోయిందని, ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతాలిచ్చేందుకు కూడా తిప్పలు పడుతోందని జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇలా ఓ పక్క ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నప్పటికీ…సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టడం మాత్రం జగన్ ఆపకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన ఆలోచనా విధానం లేకపోవడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తారుమారైందని, రాష్ట్రానికి సామర్ధ్యం ఉన్న నాయకుడు లేకపోవడం దురదృష్టకరమని ఐవైఆర్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఏపీ ఆర్థిక దుస్థితి చూస్తుంటే బాధేస్తోందని, ఒకటో తారీకున ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు.

ప్రభుత్వాస్పత్రుల్లో పరికరాలు లేని దుస్థితి దాపరించిందని, రాష్ట్రంలో రోడ్ల దుస్థితి,ఆస్పత్రుల్లో కుట్లు వేయడానికి దారం కూడా లేని విధంగా ఏపీ ఆర్థిక శాఖ దిగజారిందని అన్నారు. విశాఖలోని భూములు తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనలు రాష్ట్ర ఆర్థిక దుస్థితికి నిదర్శనమని, రాష్ట్రం నెత్తిమీద ఉన్న రూ.5లక్షల కోట్ల అప్పును ఎలా తీరుస్తారని ఐవైఆర్ ప్రశ్నించారు. అప్పు తేవడం.. పంచడం మాత్రమే పనిగా పెట్టుకున్నారని, ఇంకా ఎంతకాలం అప్పు పుడుతుందో ప్రభుత్వం ఆలోచించుకోవాలని హితవు పలికారు.

తెచ్చిన అప్పులను తీర్చేందుకు కార్యాచరణ, ప్రణాళిక ఏముందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత ఇమేజ్ కోసం లక్షల కోట్ల రూపాయలు పప్పు బెల్లాల్లా పంచుతూ పోతే చివరకు పంచడానికి ఏమీ మిగలదన్నారు. బడ్జెట్ మొత్తం తాయిలాలకు సరిపోతోందని, మరి, మౌలిక సదుపాయాల మాటేమిటని ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతుందన్నారు.

భవిష్యత్తులో నెల నెల జీతాలు చెల్లించడం కూడా కష్టమేనని, జగనన్న ఇళ్ల నిర్మాణానికి సిమెంటు, స్టీల్ అప్పు అడుగుతున్న అధికారులు.. ఇకపై నెలవారీ సరుకులు కూడా అప్పుగా తెచ్చుకోవాల్సిన దుస్థితి రావొచ్చని జోస్యం చెప్పారు. చెప్పినవన్నీ చేయడానికి ప్రభుత్వం దగ్గర మంత్ర దండం, అల్లావుద్దీన్ అద్భుత దీపం లేవని చురకలంటించారు. సంక్షేమ పథకాలకు ఖర్చు చేయటం తప్పు కాదని, కేంద్రం తరహాలో బడ్జెట్లో 10 శాతానికి మించకుండా పథకాలకు ఖర్చు చేయవచ్చని సలహా ఇచ్చారు. ఏపీకి సరైనోడు లేడంటూ ఐవైఆర్…. జగన్ గాలి తీశారని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

Tags: ap cm jagandebts in apex ias iyr krishnaraojagan freebiesshocking commentswelfare schemes in ap
Previous Post

దళితబంధు ఆగిపోవడానికి కారణం ఎవరు?

Next Post

షాకింగ్…మోహన్ బాబుపై కేసు

Related Posts

tdp and ycp logos
Politics

టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?

March 23, 2023
sajjala ramakrishna reddy
Politics

స‌జ్జ‌ల వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?

March 23, 2023
jagan lost people vote
Politics

వైసీపీలో వారిపై  అనుమానం చూపులు

March 23, 2023
manchu mohanbabu
Andhra

నిజ‌మేనా… మోహ‌న్‌బాబు మాట నొమ్మొచ్చా…!

March 23, 2023
panchumarthi anuradha
Politics

Big News : వైసీపీకి షాక్ ఇచ్చిన రెబెల్స్ – పంచుమర్తి అనురాధ గెలుపు

March 23, 2023
kcr, kavita
Telangana

కేసీఆర్ కుటుంబంలో టెన్షన్ పెరిగిపోతోందా ?

March 23, 2023
Load More
Next Post

షాకింగ్...మోహన్ బాబుపై కేసు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?
  • స‌జ్జ‌ల వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?
  • వైసీపీలో వారిపై  అనుమానం చూపులు
  • ‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం
  • నిజ‌మేనా… మోహ‌న్‌బాబు మాట నొమ్మొచ్చా…!
  • Big News : వైసీపీకి షాక్ ఇచ్చిన రెబెల్స్ – పంచుమర్తి అనురాధ గెలుపు
  • కేసీఆర్ కుటుంబంలో టెన్షన్ పెరిగిపోతోందా ?
  • ‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!
  • విశాఖలో విషాదం
  • కేటీఆర్ బుక్కయ్యాడు… ఆ ట్వీట్ వల్లేనా??
  • ఒక్కటి తేడా వచ్చినా జగన్ కు షాకే!
  • మీ టైం అస్స‌లేం బాలేదు!:  తెలంగాణ పంచాంగంలో కేసీఆర్‌కు షాక్‌
  • ఆ ఇద్దరికీ విడాకులు గ్యారంటీ !
  • పండుగ పూట కేటీఆర్ నుంచి అలాంటి ట్వీట్ వచ్చిందంటే?
  • మొన్న రేవంత్.. నిన్న బండి.. సిట్ సేమ్ సీన్

Most Read

పవన్ ఈ స్పీడేంటి సామీ !

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra