అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన సుమంత్ యార్లగడ్డ.. హీరోగా స్టార్ హోదాను అందుకోలేకపోయిన ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. గోదావరి, సత్యం, గోల్కొండ హైస్కూల్, మళ్ళీరావా వంటి చిత్రాలతో ప్రేక్షకులకు చేరువయ్యాడు. కెరీర్ గురించి పక్కన పెడితే.. సుమంత్ పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. విషయం ఏంటంటే నాలుగు పదుల వయసులో సుమంత్ రెండో పెళ్లికి సిద్ధం అయ్యాడట.
తొలిప్రేమ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న నటి కీర్తి రెడ్డిని 2004లో సుమంత్ మొదట ప్రేమ వివాహం చేసుకున్నాడు. కానీ వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లైన కొంత కాలానికే మనస్పర్థలు తలెత్తడంతో.. 2006లో సుమంత్, కీర్తి రెడ్డి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కీర్తి రెడ్డి మరొక వ్యక్తిని పెళ్లాడి ఫారెన్ లో సెటిల్ అయింది. సుమంత్ మాత్రం అప్పటి నుంచి ఒంటరిగానే ఉండిపోయాడు
అయితే విడుకులైన ఇన్నేళ్లకు సుమంత్ రెండో పెళ్లి చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. విజయవాడకు చెందిన అమ్మాయితో సుమంత్ త్వరలోనే ఏడడుగులు వేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. కానీ సుమంత్ రెండో పెళ్లిపై ఇంతవరకు ఎటువంటి అధికారిక సమాచారం బటయకు రాలేదు.
కాగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రెండో పెళ్లి గురించి సుమంత్ మాట్లాడుతూ.. గత వివాహం వల్ల నాకు ఎలాంటి రిగ్రెట్ లేదు. ఏమో భవిష్యత్తులో మళ్లీ పెళ్లి చేసుకుంటానేమో తెలియదు అని చెప్పుకొచ్చాడు. అలాగే మొదట వివాహ సమయంలో మా ఇద్దరికీ సరైన మెచ్యూరిటీ లేదు. అందుకే విడిపోయాం. అయితే విడాకుల తర్వాత కూడా కీర్తి రెడ్డి ఫ్యామిలీ నన్ను సొంత కుటుంబ సభ్యుడిగానే చూస్తూ ఉంటుంది. కీర్తి రెడ్డి సైతం అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తుంటుందని సుమంత్ తెలిపాడు.