• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆస్తి రచ్చపై విజయమ్మ షాకింగ్ లేఖ

admin by admin
October 29, 2024
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
87
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

జగన్, షర్మిలల మధ్య ఆస్తి పంచాయతీ రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఆస్తి నాదంటే నాది అంటూ అన్నాచెల్లెళ్లు పోటాపోటీగా విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై వైఎస్ విజయమ్మ తొలిసారి స్పందించారు. ఆస్తి పంపకాల విషయంలో వాస్తవాలు వెల్లడిస్తూ విజయమ్మ తాజాగా బహిరంగ లేఖ రాశారు. ఆ బహిరంగ లేఖలో విజయమ్మ సంచలన విషయాలు వెల్లడించారు. వైఎస్సార్ బతికున్నప్పుడు ఆస్తి పంపకాలు జరగలేదని, విజయ సాయి రెడ్డి కి ఈ విషయం తెలిసి కూడా అబద్ధాలు చెబుతున్నారని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తులను ఇద్దరికీ సమానంగా పంచాలి అన్నదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచన అని విజయమ్మ చెప్పుకొచ్చారు.

విజయమ్మ రాసిన బహిరంగ లేఖ యథాతధంగా..

“ఆస్తులు వృద్ధిలోకి తీసుకురావడంలో జగన్ కష్టం ఉందనేది నిజం. అన్ని ఆస్తులు కుటుంబ ఆస్తులే అన్నది నిజం. కుటుంబ ఆస్తులను సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నది కూడా నిజం. నాన్నా… నీ తర్వాత ఈ లోకంలో పాప (షర్మిల) మేలు కోరే వారిలో నేను మొదటి వాడిని అని ఈ మేరకు వైఎస్ చివరి రోజుల్లో జగన్ ఆయనకు మాట ఇచ్చారు. ఈ నిజం ‘నాలో నాతో వైఎస్ఆర్’ పుస్తకంలో ఎప్పుడో రాశాను.

రాజశేఖర్ రెడ్డి గారు బతికి ఉండగా ఆస్తులు పంచలేదు… అప్పుడు అవన్నీ కుటుంబ ఆస్తులే. ఆయన బతికి ఉన్న రోజుల్లో ఆస్తులను ఒక్కొక్కరు చూసుకున్నారు. ఆస్తులు పంపకం చేద్దాం అనుకునే సరికి ఆయన ప్రమాదంలో చనిపోయారు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా విజయసాయిరెడ్డి అవాస్తవాలు మాట్లాడారు.

రాజశేఖర్ రెడ్డి గారు మరణించాక పదేళ్ల పాటు జగన్, షర్మిల కలిసే ఉన్నారు. ఇక, డివిడెండ్ రూపంలో జగన్ వాటా తీసుకున్నాడు. షర్మిల వాటా కింద జగన్ రూ.200 కోట్లు ఇచ్చాడు. ఒప్పందం ప్రకారం జగన్ కు 60 శాతం, షర్మిలకు 40 శాతం అయితే… ఎంవోయూకి ముందు వరకు సగం సగం డివిడెండ్ తీసుకునేవారు. వీటన్నింటికీ అప్పుడు, ఇప్పుడు నేనే సాక్షి.

2019లో జగన్ విడిపోదాం అంటూ ఇజ్రాయెల్ లో ఓ ప్రతిపాదన చేశాడు. సీఎం అయిన రెండు నెలల తర్వాత ఈ ప్రతిపాదన చేశాడు. పిల్లలు పెరిగారు… నాకు అల్లుళ్లు వస్తారు… నీకు అల్లుడు, కోడలు వస్తారు… మనం కలిసున్నట్టు వాళ్లు కలిసి ఉండకపోవచ్చు… అందుకే విడిపోదాం అన్నాడు. దాంతో ఆస్తుల పరంగా కుటుంబం విడిపోవాలన్న నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత నా సమక్షంలో జగన్ కు అవి, షర్మిలకు ఇవి అంటూ ఎంవోయూ రాసుకోవడం జరిగింది. జగన్ నోటితో చెప్పి, జగన్ చేత్తో రాసిన ఎంవోయూ అది. పాప (షర్మిల)కు హక్కు ఉంది కాబట్టే రూ.200 కోట్ల డివిడెండ్ ఇచ్చారు… పాపకు హక్కు ఉంది కాబట్టే ఎంవోయూ రాసుకున్నారు. ఎంవోయూ ప్రకారం పాపకు జగన్ ఇవ్వాల్సిన ఆస్తులు గిఫ్ట్ గా ఇస్తున్నవి కావు… జగన్ తన బాధ్యత ప్రకారం ఇస్తున్నవి.

రాజకీయాల్లో పాప జగన్ చెప్పినట్టే చేసింది. జగన్ అధికారంలోకి రావడంలో షర్మిల కృషి ఎంతో ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు బతికుంటే ఈ ఆస్తుల గొడవ ఉండేది కాదు ఇప్పుడు నేను చెప్పినవన్నీ వాస్తవాలు. ఇది వాళ్లిద్దరి సమస్య… వాళ్లిద్దరే పరిష్కరించుకుంటారు.

రాజశేఖర్ రెడ్డి గారు బతికుండగానే ఆస్తులు పంచారన్నది పూర్తిగా తప్పు. అది ముమ్మాటికీ ఆస్తుల పంపకం కాదు. నాడు రాజశేఖర్ రెడ్డి గారు చేసింది ఆస్తుల పంపకం కాదు… కొన్ని ఆస్తులను ఇద్దరు బిడ్డల పేరు మీద పెట్టారు. విజయసాయిరెడ్డి అప్పుడు ఆడిటర్ గా ఉన్నారు కదా… ఆయనకు ఈ విషయాలు తెలియవా? ముఖ్యంగా… వైవీ సుబ్బారెడ్డి మా ఇంటి బంధువుగా ఎంవోయూపై సాక్షి సంతకం చేశారు.

ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనసుకు చాలా బాధ కలుగుతోందని తెలిపారు. నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావడంలేదని విచారం వ్యక్తం చేశారు. జరగకూడనివన్నీ తన కళ్ల ముందే జరిగిపోతున్నాయని, వాటిని అడ్డుకోలేని నిస్సహాయురాలిగా మిగిలిపోయా.

మా కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు. ఆస్తుల వ్యవహారంలో నేను ఇలా అందరి ముందుకు రాకూడదనే అనుకున్నాను. కానీ, ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు. తెలిసీ తెలియ కొంత… తెలియకుండా కొంత మాట్లాడుతున్నారు. ఇవి కొనసాగరాదు… నా పిల్లలకే కాదు, రాష్ట్రానికి కూడా ఇది మంచిది కాదు. రాజశేఖర్ రెడ్డి గారు… నేను, మా పిల్లలు ఎంతో సంతోషంగా ఉండేవాళ్లం. ఇంటి గుట్టు వ్యాధి రట్టు అంటారు. మీ అందరికీ మీ ఆడబిడ్డగా రెండు చేతులు ఎత్తి మనవి చేసుకుంటున్నాను. మా కుటుంబం గురించి, మా పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడొద్దు”

Tags: open letterproperty disputesys jaganys sharmilays vijayamma
Previous Post

కెనడా దరిద్రపుగొట్టు బుద్ధి.. విదేశీ విద్యార్థులకు పుడ్ బ్యాంక్ కట్

Next Post

రెండో పెళ్లికి సిద్ధ‌మైన సుమంత్‌.. అమ్మాయి ఎవరంటే..?

Related Posts

Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

`కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!

June 22, 2025
Movies

నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Andhra

మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌

June 21, 2025
Andhra

యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు

June 21, 2025
Load More
Next Post

రెండో పెళ్లికి సిద్ధ‌మైన సుమంత్‌.. అమ్మాయి ఎవరంటే..?

Latest News

  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
  • `యోగాంధ్ర`పై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు.. బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!
  • చంద్ర‌బాబా మ‌జాకా.. ప‌ట్టుబ‌ట్టారు.. రికార్డు కొట్టారు..!
  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra