ఒకట్రెండు వేవ్ లతో పోలిస్తే.. మూడో వేవ్ లో కరోనా కేసుల సంఖ్య భారీగా ఉన్నప్పటికి.. కేసుల తీవ్రత.. పాజిటివ్ గా తేలిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ రోగ లక్షణాలు మరీ ఇబ్బంది పెట్టేలా లేకపోవటం పెద్ద రిలీఫ్ గా చెప్పాలి.
సెకండ్ వేవ్ వేళ.. ఆక్సిజన్.. ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క పడిన అవస్థలు అన్ని ఇన్ని కావు. ఇక.. ఈ మధ్యనే మొదలైన మూడో వేవ్ సంక్రాంతి వేళలోనూ.. ఆ తర్వాత కేసుల తీవ్రత భారీగా పెరగటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. గడిచిన వారం రోజుల్లో కేసుల నమోదు సంఖ్య తగ్గుముఖం పడుతోంది.
ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది.
తాజాగా విడుదలైన గణాంకాల్ని చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.
గడిచిన 24 గంటల్లో కొత్తగా 1.07లక్షల కేసులు నమోదయ్యాయి. శనివారంతో పోలిస్తే ఈ తగ్గింపు ఏకంగా 16 శాతం ఉండటం గమనార్హం.
ఇక.. పాజిటివిటీ రేటు కూడా 7.42 శాతానికి పడిపోవటం.. యాక్టివ్ కేసుల సంఖ్య సైతం 2.9 శాతంగా ఉంది.
రికవరీ రేటు 95.91గా ఉంది. గడిచిన 24 గంటల్లో 865 మంది మరణించారు.
దీంతో.. దేశవ్యాప్తంగా మొత్తం మరణాలు 5,01,979కు చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 7.42 శాతంగా ఉంటే.. వారం పాజిటివిటీ రేటు 10.20శాతంగా నమోదైంది.
ఇదిలా ఉంటే.. వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది.
ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 169 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని పంపిణీ చేశారు.
శనివారం ఒక్కరోజునే దేశ వ్యాప్తంగా దాదాపు 43 లక్షల మందికి టీకా వేశారు.
తాజాగా అందుతున్న గణాంకాల్ని చూస్తే.. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతూ.. సాధారణ పరిస్థితులు నెలకొంటున్న పరిస్థితి.
మరో.. వారం.. పది రోజుల్లో కేసుల నమోదు మరింత తగ్గటం ఖాయమంటున్నారు.